హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింహం సింగిల్‌గా వస్తుంది, ఎవరూ ఏం చేయలేరు: ఎంపీ కవిత

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నేతలను టిజిబికెఎస్‌లోకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. 11 ప్రాంతాలకు చెందిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు టిజిబికెఎస్‌లో చేరారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నేతలను టిజిబికెఎస్‌లోకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. 11 ప్రాంతాలకు చెందిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు టిజిబికెఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. సింగరేణిని కుదించాలని గతంలో అధికారం చేపట్టిన పార్టీలు భావిస్తే కెసీఆర్ మాత్రం సింగరేణి ద్వారా ఉద్యోగాల కల్పన పెంచాలని భావించారన్నారు.

ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు కలిసి టిజిబికెఎస్‌ను ఓడించాలని కలలు కంటున్నాయని, పోరాటాల చరిత్రను చెప్పుకుంటున్న ఏఐటీయూసీ వారసత్వ ఉద్యోగాలను తొలగిస్తే ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.

MP Kavitha compares CM KCR with lion

వారసత్వ ఉద్యోగాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఆ ఉద్యోగాలను ఎలా అమలు చేయాలా అని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. కార్మికులకు పరిహారం రూ. ఆరు లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచామన్నారు.

ఎన్ని కూటములు వచ్చినా సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయలేవని, సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

English summary
Telangana Rastra Samithi leader and Nizamabad MP Kalvakuntla Kavitha compared CM KCR with lion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X