హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారు ఏం రాసిచ్చారో కానీ: మోడీకి కవిత కౌంటర్, థ్యాంక్స్ అంటూ ప్రధాని వీడియోలు ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామాబాద్, మహబూబ్ నగర్‌లలో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నిప్పులు చెరిగారు. మోడీ తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఏం రాసిచ్చారో కానీ మోడీ తన స్థాయి దిగజార్చుకున్నారన్నారు.

ఇక్కడ అభివృద్ధి జరగలేదని, పేద రాష్ట్రాల కంటే అద్వాన్నంగా ఉందని చిత్రమైన మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం తాము ఎంతో చేశామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారే ఇవ్వలేదన్నారు. రైతుకు పనికొచ్చే పనులు చేయడం లేదన్నారు.

మీ నుంచి సహకారం లేదు

మీ నుంచి సహకారం లేదు

నిజామాబాద్ అభివృద్ధి కోసం తాము ఎంతో పని చేస్తున్నా, అంతేస్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు లేదని కవిత అన్నారు. ఇక్కడ రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికీ నీరు ఇస్తున్నామని, కరెంట్ ఇస్తున్నామని, పట్టణాన్ని సుందరీకరణ చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో కొంత దుమ్ము ఉండవచ్చన్నారు. తెరాసను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు అందరూ కలసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ లేదు

మ్యాచ్ ఫిక్సింగ్ లేదు

మోడీ ఆరోపించినట్టు కాంగ్రెస్‌తో తమకు మ్యాచ్ ఫిక్సింగ్ లేదని, ప్రజలతోనే తమకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కవిత చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో ఉండే పేదవారికి ప్రతీ నెల 28 వేల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. నిజామాబాద్‌లో ఇప్పటికే అండర్‌గ్రౌండ్ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు.

వారికి ఉన్న ఓపిక మోడీకి లేదు

వారికి ఉన్న ఓపిక మోడీకి లేదు

తమ పాలనలో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలంటే రోడ్లు తవ్వడం జరుగుతుందని, ఈ విషయాన్ని గుర్తించి ఎంతో ఓపికగా ఉండి సహకరిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తన ధన్యవాదాలని, నిజామాబాద్ ప్రజలకు ఉన్న ఓపిక కూడా ప్రధాని మోడీకి లేదన్నారు.

వీడియోలు పోస్ట్ చేసిన మోడీ

వీడియోలు పోస్ట్ చేసిన మోడీ

ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలోని ప్రచార వీడియోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

'కాంగ్రెసు మరియు తెరాస ల మధ్య స్నేహ పూర్వక పోటీ ఉంది...
కె. సి. ఆర్ గారికి మేడంగారి క్రింద పని చేయమంటే చాలా ఆనందం.
భారతీయ జనతా పార్టీ ఒక్కటే తెలంగాణ సమస్యలన్నింటినీ పరిష్కరించగలదు ...'

'అందరితో కలసి ... అందరి అభివృద్ధి - అన్నది భారతీయ జనతా పార్టీ మంత్రము
తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వారికి సేవ చెయ్యడమే మా ప్రధాన లక్ష్యం'

'తెలంగాణా ముఖ్యమంత్రికి తన మీద, తన పని మీద నమ్మకం లేదు...రానురాను మూఢనమ్మకంతో జీవిస్తున్నారు...

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా పేదప్రజలకు ఎంతో అన్యాయం చేస్తున్నారు...'

'కాంగ్రెసు వంశపారంపర్యంగా అభివృద్ధి చెందింది కాబట్టి తను కూడా అలాగే తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని వారసత్వ పాలనను తెలంగాణా పై రుద్దవచ్చు అనుకొంటున్నాడు
... కాని ఆయనకు బాధాకరమైన అంశమేమంటే ఇప్పుడు కాలం మారింది...!'

'తెలంగాణా ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీ ద్వారా చాలా స్ఫూర్తిని పొందారు...

ఆయన ఏ భ్రమలో ఉన్నారంటే - అసలు ఏం పని చేయకపోయినా కాంగ్రెసు ఎన్నోసార్లు గెలిచింది కాబట్టి తను కూడా ఏ పని చేయకపోయినా గెలవవచ్చునని అనుకుంటున్నారు...' అంటూ పలు ట్వీట్లు చేశారు.

English summary
TRS leader and Nizamabad MP Kalvakuntla Kavitha counter to PM Narendra Modi over district development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X