• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షబ్బీర్! రాజీనామా చేయకపోయినా మేయర్ మాదే: ఒక్క అవకాశమివ్వండని కవిత(పిక్చర్స్)

|

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల పక్షపాతి అని, ఆడడబిడ్డల పేరిట రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసేందుకు ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

సోమవారం సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ఆజంపురా డివిజన్లలో ఎన్నికల సభల్లో భువనగిరి ఎంపీ డా బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి ఆమె మాట్లాడారు. మలక్‌పేట నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని వివరించారు.

డ్వాక్రా సంఘాలకు రుణాలిప్పించేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం తెరాస అభ్యర్థులను గెలిపించాలని, గ్రేటర్‌లో ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశమివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సైదాబాద్, ఐఎస్‌సదన్ డివిజన్‌ల ఎన్నికల పరిశీలకులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మహబూబ్‌నగర్ జడ్‌పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, గద్వాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి, మలక్‌పేట టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సతీశ్‌కుమార్, అడ్వకేట్ జేఏసీ ఉపేందర్, ధర్మరాజు, మన్యరంగ పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల పక్షపాతి అని, ఆడడబిడ్డల పేరిట రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసేందుకు ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

నగరంలోని మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

సోమవారం సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ఆజంపురా డివిజన్లలో ఎన్నికల సభల్లో భువనగిరి ఎంపీ డా బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి ఆమె మాట్లాడారు. మలక్‌పేట నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని వివరించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

డ్వాక్రా సంఘాలకు రుణాలిప్పించేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం తెరాస అభ్యర్థులను గెలిపించాలని, గ్రేటర్‌లో ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశమివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి సైదాబాద్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా, ఐఎస్ సదన్ డివిజన్‌లోని విష్ణునగర్ చౌరస్తాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్నసుందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సైదాబాద్ ఎర్రకుంట హిందూ స్మశానవాటికను ఇప్పటికే కేసీఆర్ సందర్శించి రూ.2కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని, కోర్టులో స్థల వివాదం విచారణలో ఉన్నందున పనులు ప్రారంభించలేదన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ఐఎస్ సదన్ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే గుడిసెవాసులందరికీ పక్కా ఇండ్లు నిర్మించి, పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. షబ్బీర్ అలీ రాజీనామా చేసినా చేయకపోయినా మేయర్ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని, గ్రేటర్‌లో గులాబీ జెండాలు రెపెరెపలాడుతాయన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని, ఈ క్రమంలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మహిళల పేరుపై ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. మోడీ ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణానికి లక్షన్నర వెచ్చిస్తున్నదని, ఆ డబ్బుతో కనీసం బాత్‌రూమ్ కూడా నిర్మించలేమని ఎద్దేవా చేశారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ఇంటికి రూ.9లక్షలు వెచ్చించి అన్ని హంగులతో డబుల్‌బెడ్‌రూమ్‌లను నిర్మిస్తుందన్నారు. వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500ల పించను దేశంలో ఏ సర్కార్ కూడా ఇవ్వని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

మైనారిటీ సోదరుల కోసం ఉర్దూ అకాడమీలద్వారా స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తామన్నారు. ఐఎస్ సదన్ డివిజన్‌లో భూ సమస్య ప్రధానంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి, గ్రేటర్‌లోనే ఐఎస్ సదన్ డివిజన్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ఈ డివిజన్‌లో గత బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, టీఆర్‌ఎస్ అభ్యర్ధి స్వప్నసుందర్‌రెడ్డిని గెలిపిస్తే తాను కూడా డివిజన్ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల పక్షపాతి అని, ఆడడబిడ్డల పేరిట రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసేందుకు ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

సోమవారం సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ఆజంపురా డివిజన్లలో ఎన్నికల సభల్లో భువనగిరి ఎంపీ డా బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి ఆమె మాట్లాడారు. మలక్‌పేట నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని వివరించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

డ్వాక్రా సంఘాలకు రుణాలిప్పించేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం తెరాస అభ్యర్థులను గెలిపించాలని, గ్రేటర్‌లో ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశమివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

English summary
TRS MP Kalvakuntla Kavitha on Monday campaigned for GHMC elections in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X