వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డామిట్.. కథ అడ్డం తిరిగిందే..!! ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న కోమ‌టిరెడ్డి, కాంగ్రెస్ హైక‌మాండ్??

|
Google Oneindia TeluguNews

భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తోంది. ఒక‌రి ఎత్తుకు మ‌రొక‌రు పై ఎత్తు వేస్తున్నారు. త‌న‌కు కావ‌ల్సిన ''అవ‌కాశం' కోసం చూస్తున్న కోమ‌టిరెడ్డికి అటువంటి ''అవ‌కాశం'' ద‌క్క‌నివ్వ‌కూడ‌ద‌నే యోచ‌న‌లో ఢిల్లీ అధినాయకత్వం ఉంది. దీంతో ఎవ‌రికివారు పై చేయి సాధించ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

తర్వాతే కథ అడ్డం తిరిగింది!!

తర్వాతే కథ అడ్డం తిరిగింది!!


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌వ‌ల్ల తన మ‌న‌సు బాధ‌ప‌డిందంటూ కోమ‌టిరెడ్డి క్ష‌మాప‌ణ‌ల కోసం రెండుసార్లు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కూడా త‌గ్గి తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు బాధ‌ప‌డుతున్నానంటూ ఆయనకు క్ష‌మాప‌ణ‌లు తెలియజేశారు. ఆ త‌ర్వాతే క‌థ అడ్డం తిరిగింది. వెంక‌ట‌రెడ్డి గేమ్ ప్రారంభించిన‌ట్లు కాంగ్రెస్ హై క‌మాండ్ అభిప్రాయ‌ప‌డుతోంది. పార్టీ కోసం ప‌నిచేసే ఉద్దేశం ఉంటే ఆయ‌న ఇంత‌టితో ఈ వ్య‌వ‌హారాన్ని ముగించేవార‌ని, ఆ ఉద్దేశం లేదుకాబ‌ట్టే ఇంకా నాన్చుతున్నార‌నే అభిప్రాయానికి వ‌చ్చింది.

 మునుగోడు బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పటికీ..

మునుగోడు బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పటికీ..


మునుగోడులో పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి కోమ‌టిరెడ్డి ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ని కాంగ్రెస్ పార్టీ నేతలు అంచ‌నాకు వ‌చ్చారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు మునుగోడు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నుకున్న‌ప్ప‌టికీ ఆ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకున్నారు. సోద‌రుడి కోసం ఆయ‌న మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేసే దాఖ‌లాలు క‌న‌ప‌డ‌టంలేద‌ని, రాజగోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌నిచేయ‌రు అని నిశ్చ‌యించుకున్నారు.

Recommended Video

అధ్యకుడి క్షమాపణకి శాంతించని కోమటిరెడ్డి *Telangana | Telugu Oneindia
ఉంటే ఉండండి.. పోతే పోండి..

ఉంటే ఉండండి.. పోతే పోండి..


తాజాగా ఏఐసిసీ కార్యదర్శుల స్థాయి నేతలు కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్యవహారంపై చర్చిస్తున్నారు. ''పార్టీలో ఉంటే ఉండండి.. చెప్పిన‌ట్లు వినండి.. లేదంటే బ‌య‌ట‌కు వెళ్లండి'' అనేలా సంకేతాలను పంపించ‌బోతున్నారు. నిజానికి కోమ‌టిరెడ్డి కోరుకుంటోంది కూడా ఇదే. త‌నంత‌ట తాను వెళితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తే సానుభూతి పొంద‌వ‌చ్చ‌నేది యోచ‌న‌గా ఉంది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన పార్టీ అగ్ర‌నేత‌లు భిన్న‌మైన ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌బోతున్నారు. మునుగోడు ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఫ‌లితాన్ని బ‌ట్టి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు నిర్ణ‌యించుకోవాల‌నే యోచ‌న‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఉన్నారు. అయితే ఆయ‌న‌కు అంత అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తాజాగా వీరి పోరు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.!!

English summary
Bhuvangiri MP Komati Reddy Venkata Reddy and the Congress leadership are fighting each other.The height of one is rising above the other
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X