వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రి బోమ్మల వివాదం : ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయ నాయకుల బోమ్మలు పెట్టడంపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు సీఎం కేసిఆర్‌పై విమర్శలను ఎక్కుపెట్టాయి. యాదగిరి గుట్ట స్తంభాలపై బొమ్మలు చెక్కిన అంశం వివాదం అవుతున్న నేపపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ రాశారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయాలకు చొటిచ్చి భక్తుల నమ్మకాలను సీఎం కేసిఆర్‌ దెబ్బ తీశాడని ఆయన విమర్శలు చేశాడు. ప్రభుత్వం చేపట్టిన చర్యతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను సీఎం దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆలయ అష్టభుజి ప్రాకర మండపంలోని రాతి స్థంభాలపై సీఎం కేసిఆర్ బొమ్మతో పాటు కారు టీఆర్ఎస్ చిహ్నమైన కారు గుర్తును చెక్కడం దారుణం అని అన్నారు.

MP Revant Reddy wrote an open letter to the government on controversy over Yadadri

మరోవైపు బీజీపీ నేతలు కూడ ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈనేపథ్యంలోనే శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. దీంతో యాదాద్రి బొమ్మల తీరు రాష్ట్రంలో దుమారం రేపనుంది. అయితే యాదాద్రిలో శిల్పాలపై కేవలం సీఎం కేసిఆర్‌తోపాటు కారు బొమ్మలు ఉన్నట్టు మాత్రమే ఓ మీడీయాలో కథనం వచ్చింది. తాజాగా గుడి స్తంభాలపై కేవలం సీఎం కేసిఆర్ బోమ్మలే కాకుండా, భారత మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతోపాటు, మాజీ ఇందిరాగాంధి, ఇతర నాయకుల బోమ్మలు ఉన్నట్టు సోషల్ మీడీయాలో తిరుగుతున్నాయి. మరి బోమ్మలు చెక్కడంపై ప్రభుత్వం ఎలాంటీ వివరణ ఇవ్వలేదు.

English summary
Congress MP Revant Reddy wrote an open letter to the government on controversy over the subject of Yadagiri Gutta pillars issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X