వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

గత అయిదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ కల్పనపై ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ రాశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం మాయమాటలు చెప్పి అధికారలంలోకి వచ్చారని లేఖలో పేర్కోన్నారు.ఇప్పటికైన ప్రభుత్వం యువతపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణలో యువత నిర్లక్ష్యానికి గురవుతుందని లేఖలో పేర్కోన్నారు. ఉద్యోగాల కల్పనకు యువజన కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన కోసం స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన యువజన కమీషన్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

లేఖలో భాగంగానే ప్రభుత్వ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరిని సామాజిక మాద్యమాల ద్వార ఎండగట్టిన కేసులు పెట్టిన జైళ్లలో వేస్తున్నారని లేఖలో పేర్కోన్నారు.ఇటిల ప్రభుత్వంపై ఆయన బహిరంగ లేఖలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

MP Revanth Reddy wrote open letter to government

ఈ నేపథ్యంలోనే ఇటివల యాదాద్రి బొమ్మలపై వివాదం చెలరేగినప్పుడు కూడ ఆయన ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయాలకు చొటిచ్చి భక్తుల నమ్మకాలను సీఎం కేసిఆర్‌ దెబ్బ తీశాడని ఆయన విమర్శలు చేశాడు. ప్రభుత్వం చేపట్టిన చర్యతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను సీఎం దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు.

English summary
MP Revanth Reddy criticized the TRS government for cheating the youth for the last five years. He wrote an open letter to the government on job creation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X