జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తన ముందే తెరాస నేత, ఎంపీ వాగ్వాదం, ఇదేం తీరని కేసీఆర్ అసహనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎదుటే మహబూబ్ నగర్ జిల్లా నేతలు వాదులాడుకోగా, దానిపై సీఎం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కేసీఆర్ పలు జిల్లాల నేతలతో మాట్లాడిన విషయం తెలిసిందే.

దిగొచ్చిన కేసీఆర్! ఆ 3 జిల్లాలకు ఓకే: కొత్త వాటితో ప్రయోజనాలెన్నోమహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలతో సమావేశం సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డిలు ఆత్మకూరు, చిన్నచింతకుంట, అమరచింత మండలాల అంశంపై వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

వ్యక్తిగత ప్రతిష్ఠలకు పోవద్దని ఇరవురు నేతలకు సూచించారు. ఈ అంశంపై నిఘా వర్గాల సమాచారం, ప్రజాభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకోవాలన్నారు.

 MP and TRS leaders war of infront of KCR

కాగా, రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, ఇతర నేతలు శంషాబాద్‌ జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టాలని, వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి అనంతగిరి పేరు పెట్టాలని, తాండూరును డివిజన్‌ చేయాలని కోరారు. శంషాబాద్‌పై వినతిని అంగీకరించిన కేసీఆర్ అనంతగిరి పేరుపై హామీ ఇవ్వలేదు. మెదక్ జిల్లా నేతల వినతులను ఆయన అంగీకరించారు.

ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించా, కానీ: కేసీఆర్, నయీం పైనా స్పందననల్గొండ జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా మండలాల మార్పు ప్రతిపాదనలను అంగీకరించారు. కొత్త జిల్లాల కార్యాలయాల ఏర్పాట్లు, వాటికి శాశ్వత నిర్మాణ స్థలాల ఎంపికపై దృష్టి సారించాలన్నారు. దసరా రోజు ఓఎస్డీలుగా కొత్త కలెక్టర్లు బాధ్యతలు చేపడతారని కేసీఆర్ చెప్పారు. మోటకొండూరు మండలంపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

నిజామాబాద్‌ జిల్లా నేతల సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలను కేసీఆర్ అంగీకరించారు. ఎల్లారెడ్డిని డివిజన్‌ కేంద్రం చేయాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేయగా.. అనుమతించారు. జక్రాన్‌పల్లి, ఆర్మూరుల్లో మండలాల మార్పులు చేర్పులపై చర్చించారు.

English summary
MP Jitender Reddy and TRS leaders Niranjan Reddy war of infront of KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X