హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ధర్నా: మహిళ మృతి, అసెంబ్లీలో విపక్షాల ఆందోళన

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు హైద్రాబాద్‌ కలెక్టరేట్‌ను సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అపశృతి చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు హైద్రాబాద్‌ కలెక్టరేట్‌ను సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అపశృతి చోటుచేసుకొంది. ఈ సందర్భంగా చోటుచేసుకొన్న తోపులాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రికి తరలించిన సమయంలోనే మహిళ కార్యకర్త భారతి మరణించింది.

ఎస్‌సి వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

MRPS lady worker injured at Hyderabad collectorate

ఈ కార్యక్రమంలో భాగంగా హైద్రాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో పోలీసులకు, ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకొంది.

ఈ సమయంలో భారతి అనే మహిళ కార్యకర్త స్పృహ తప్పిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించి చనిపోయినట్టు ప్రకటించారు.అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డి ప్రస్తావించారు.

భారతి మృతిపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భారతి ఫిట్స్‌తో చనిపోయిందని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రకటన చేస్తారని హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రకటించారు

English summary
MRPS lady worker severly injured at Hyderabad colletorate on Monday. MRPS workers protest dharna for SC categarition at Hyderabad collectorate on Monday .Mrps lady worker Bharahi died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X