వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీతక్క ఫైర్: వైన్ షాపులు తెరవడంలో ఉన్న శ్రద్ద, పేదల సమస్యలపై లేదు..

|
Google Oneindia TeluguNews

వైన్ షాపులు తెరవడంలో ఉన్న శ్రద్ద, పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని లేదన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు పథకం ఇవ్వబోమని రైతులను ప్రభుత్వం బెదిరించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల రైతులు సాగుచేసుకుంటున్న భూములకు.. ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

విజయారెడ్డిపై దాడి సరికాదు, రెవెన్యూ లోపాల వల్లే సమస్య: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్విజయారెడ్డిపై దాడి సరికాదు, రెవెన్యూ లోపాల వల్లే సమస్య: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

డబుల్ బెడ్ రూం ఇళ్ల ఊసేలేదని సీతక్క విమర్శించారు. గుడిసెలు వేసుకున్న పేదల ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. కొందరికీ ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదని గుర్తుచేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లు పంపిణీ చేస్తామని జీవో తీసుకొచ్చిన ప్రభుత్వం ఎంతమందికి అందజేసిందని ప్రశ్నించారు. తానే కొందరికీ మాస్క్‌లు ఇచ్చానని తెలిపారు. మాస్క్‌ల పంపిణీ విషయంలోనూ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని సీతక్క ఆరోపించారు.

mulugu mla seethakka angry on telangana govt

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గల ఏరియా ఆస్పత్రి కమిటీ నియామకంలో అవకతవకలు జరిగాయని సీతక్క ఆరోపించారు. జిల్లా అభివృద్ది కమిటీలో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలని.. ఆ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. జిల్లా అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులకు సరైన గౌరవం ఇవ్వడ లేదు అని, ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని మండిపడ్డారు.

English summary
mulugu mla seethakka angry on telangana government for not solving people problems
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X