వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పవర్ కట్ ఎఫెక్ట్ .. తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థ హై అలెర్ట్

|
Google Oneindia TeluguNews

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా అంధకారం అలముకున్న విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ అంతరాయంతో మెట్రో , సబర్బన్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. ముంబై మహా నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థ పనితీరు పై, విద్యుత్ పంపిణీ సంస్థ సి.ఎం.డి రఘుమా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కోవిడ్ నిబంధనల ఉల్లంఘనతో బార్ సీజ్ .. మాస్కులు లేకుండా, గుంపులుగా జనం .. షాకింగ్ వీడియోకోవిడ్ నిబంధనల ఉల్లంఘనతో బార్ సీజ్ .. మాస్కులు లేకుండా, గుంపులుగా జనం .. షాకింగ్ వీడియో

విద్యుత్ సరఫరాపై , ఫీడర్ల పనితీరుపై సమీక్ష జరిపిన విద్యుత్ పంపిణీ సంస్థ సి.ఎం.డి

విద్యుత్ సరఫరాపై , ఫీడర్ల పనితీరుపై సమీక్ష జరిపిన విద్యుత్ పంపిణీ సంస్థ సి.ఎం.డి

తెలంగాణ సూపరిండెంట్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ ల తో విద్యుత్ సరఫరా పనితీరును, రాష్ట్రంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన గ్రిడ్ , ఫీడర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అన్నది ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఫీడర్లు సక్రమంగా పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, అలాగే ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వర్షాకాలం కావటంతో అధికారులకు పలు సూచనలు

వర్షాకాలం కావటంతో అధికారులకు పలు సూచనలు

వర్షం నీరు నిల్వ ఉన్న చోట గల విద్యుత్ స్తంభాలు , తీగల వద్ద ఉన్న ఇన్సులేషన్ ను పరీక్షించి, ఎక్కడ విద్యుత్ లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించిన ఆయన, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగి పడి ఉంటే , క్రిందికి వేలాడుతుంటే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
విద్యుత్ అంతరాయం కలిగితే విద్యుత్ కార్యాలయాల ఫోన్ నెంబర్లతో పాటు , విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూం నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎండీ అధికారులకు సూచించారు.

ముంబై పవర్ కట్ ఘటనతో అలెర్ట్ అయిన తెలంగాణా విద్యుత్ పంపిణీ వ్యవస్థ

ముంబై పవర్ కట్ ఘటనతో అలెర్ట్ అయిన తెలంగాణా విద్యుత్ పంపిణీ వ్యవస్థ

ఏ ప్రాంతంలో అయినా విద్యుత్ అంతరాయం తలెత్తితే కంట్రోల్ రూమ్ ల కు కాల్ చేసి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముంబై తరహాలో విద్యుత్ సరఫరాకు విఘాతం కలగకుండా ఉండేలా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అలర్ట్ అయింది. అధికారులకు కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలం కావటంతో విద్యుత్ వినియోగం గతంతో పోలిస్తే తగ్గినా మహారాష్ట్రలోని ముంబైలో విద్యుత్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలటంతో ముందస్తు జాగ్రత్తలపై తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ దృష్టి పెట్టింది .

English summary
The power system in Telangana is now on high alert following a massive power cut in Mumbai. power distribution company,CMD Raghuma Reddy,held a review meeting on the performance of the power system in the wake of heavy rains. Superiors were alerted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X