వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మున్సిపల్ ఎన్నికల కౌంటర్ పిటిషన్‌లో అభ్యంతరాలు.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలను పాత చట్టం ప్రకారమే నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నిలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టుకు నివేదించింది. వార్డుల విభజన గందరగోళం, తదితర అంశాలపై అభ్యంతరాలు పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వారి అభ్యంతరాలను ఒక్కరోజులో పరిష్కరించడం కుదరదని హైకోర్టు అభిప్రాయపడింది.

మరోవైపు కౌంటర్ పిటిషన్‌లో పూర్తి వివరాలు సమర్పించలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కొత్త మున్సిపల్ చట్టం వివరాలను కూడా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ గందరగోళంగా ఉందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు అందులో సరైన ఆధారాలు కూడా లేవని పేర్కొన్నది. అయితే కౌంటర్ పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొన్న అంశాలపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికలపై అభ్యంతరాలపై పూర్తి వివరాలు అందించాలని స్పష్టంచేసింది.

municipal election counter pettion are objections : highcourt

కరీంనగర్ 109, మహబూబ్ నగర్ 177, మీర్ పేట 39, సుల్తానాబాగ్ 37 అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నది. ఈ మున్సిపాలిటీలో ఉన్న అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని .. ఈ నెల 21న పిటిషన్ విచారిస్తామని .. తదుపరి విచారణను వాయిదావేసింది.

English summary
The state government has made it clear that municipal elections in the state will be conducted under the old law. Reported to the High Court on petitions filed in this regard. Petitioners objected to the division of the wards and the objections to it. However, the High Court believes that their objections cannot be resolved in a single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X