వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతంకాదిది.. ఆరంభమే: పెద్దనోట్లు రద్దుపై మురళీధర్ రావు

దేశ ప్రజలు నగదు రహిత లావాదేవీలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: దేశ ప్రజలు నగదు రహిత లావాదేవీలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బుధవారం హంటర్‌రోడ్డులోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మురళీధర్‌రావు మ్లాడారు. భారతీయ జనతా పార్టీ నల్లధనంపై యుద్ధాన్ని ప్రకించిందని, కాంగ్రెస్‌ హయాంలోనే నల్లధనం పురుడుపోసుకుందని మురళీధర్‌రావు ఆరోపించారు.

కాంగ్రెస్‌ 70ఏళ్ల పాలనలో అవినీతి పెంచి పోషించిందన్నారు. ఈ నల్లధనం ప్రభావం రాజకీయాలు ప్రభుత్వాలపై పెద్ద ప్రభావం చూపుతుందని దీన్ని తగ్గించేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నల్లధనంపై యుద్ధం ప్రకించిందని అన్నారు.ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. బీజేపీ పార్లమెంటు సభ్యులకు విదేశీ బ్యాంకుల్లో అకౌంట్లు లేవని, పార్లమెంటులో లెటర్‌ ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. స్వాతంత్య్రానంతరం నోట్ల రద్దు చారిత్రక నిర్ణయమన్నారు.

Muralidhar rao on big notes ban

రూ. 500, రూ. 1000 నోట్లతోనే నల్లధనం పెరిగిందన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. నోట్ల రద్దుతో రాబోయే బడ్జెట్‌లో పేద మధ్య తరగతి ప్రజలకు ప్రత్యేక రాయితీలుకేటాయిస్తారన్నారు. ముఖ్యంగా భూమి ధరలు, బంగారం ధరలు తగ్గుతాయన్నారు. నల్లధనం ద్వారానే భూమి, బంగారం ధరలు పెరిగాయని, నోట్ల రద్దుతో త్వరలో అందుబాటులో వస్తాయన్నారు.

31జిల్లాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ బీజేపీయేనని, రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళా నాయకత్వంపై బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మూడు జిల్లాలకు మహిళా అధ్యకక్షులు ఉన్నారన్నారు.

పార్టీ బలోపేతానికి కృషిచేసేవారికి భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అర్బన్‌ అధ్యకక్షురాలు రావుపద్మ, బీజేపీ నాయకులు గుజ్జుల నర్సయ్య, కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్‌ అశోక్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ సంగానీ జగదీశ్వర్‌, అమరేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

English summary
BJP leader Muralidhar rao responded on big notes ban issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X