హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ విషయంలో గొడవ: హైదరాబాద్‌లో పోలీస్ వాహనం ముందే దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

Recommended Video

హైదరాబాద్‌లో పోలీస్ వాహనం ముందే దారుణ హత్య

హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగా దారుణ హత్య జరిగింది. ఎంతోమంది చూస్తుండగానే దుండగులు గొడ్డలి, కొడవలితో ఒకరిని నడి రోడ్డుపై నరికారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ఆగలేదు. పోలీసులను చూసి కూడా భయపడలేదు.

డేటింగ్‌కు అమ్మాయిలను పంపిస్తామంటూ: 400 ఉద్యోగులతో, పోలీసులే అవాక్కుడేటింగ్‌కు అమ్మాయిలను పంపిస్తామంటూ: 400 ఉద్యోగులతో, పోలీసులే అవాక్కు

వారు గొడ్డలితో దాడి చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఓ నిందితుడు గొడ్డలితో దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 138 వద్ద అతనిని ఇద్దరు నరికి చంపారు. పోలీస్ వ్యానుకు కొద్ది అడుగుల దూరంలోనే జరిగింది.

Murder at Attapur in day light: Public and police watched like spectators

మృతి చెందిన వ్యక్తిని రమేష్‌గా గుర్తించారు పోలీసులు. ఆరు నెలల క్రితం శంషాబాద్‌లో మహేష్ అనే యువకుడిని ఇప్పటి హతుడు రమేష్ చంపేశాడు. ఈ కేసులో రమేష్ అరెస్టై బెయిల్ పైన బయటకు వచ్చాడు. హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు హాజరై వస్తుండగా దుండగులు నరికారు.

అప్పుడు ఓ మహిళ కేసులో గొడవ కారణంగా మహేష్‌ను రమేష్ చంపేశాడు. ఇప్పుడు రమేష్‌ను మహేష్ తండ్రి, అతని బంధువు నరికి చంపారు. గతంలో జరిగిన మహేష్ హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు రమేష్‌ను చంపారు. మృతుడు రమేష్ సిద్దిఆంబర్ బజార్‌కు చెందినవాడు.

పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ముందే ఘటన జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తుండగానే హత్య జరిగింది. దుండగులను అడ్డుకునేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. కానీ వారి చేతిలో మారణాయుధాలు ఉండటంతో ఏం చేయలేకపోయారు.

English summary
A murder took place at Attapur pillar number 143 in day light in the presence of a traffic constable on Wednesday. Unknown suspected four members by using axe killed a person. Later the murderers spent some time at the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X