• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిర్యాలగూడలో ఈ నెల 24న 'మర్డర్ '.. 22న ప్రెస్ మీట్ లో వివరాలు , ఏం జరుగుతుందో టెన్షన్ !!

|

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ 'మర్డర్' సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే .ఇప్పటికే కోర్టులు , కేసులు అంటూ పలు వివాదాలు చెలరేగిన ఈ సినిమా విషయంలో రాం గోపాల్ వర్మ తాజాగా మరో బాంబ్ పేల్చారు. ఈ సినిమాను ఈ నెల 24 న రిలీజ్ చేస్తున్నామని వర్మ ప్రకటించారు . అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ను వర్మ ఈ నెల 22 న మిర్యాలగూడాలో నిర్వహించనున్నట్టు వర్మ ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .

"మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ "..మరో రెండు పోస్టర్లు ..కాంట్రవర్సీలతో ఆర్జీవీ మర్డర్

అవాంతరాలను అధిగమించి మర్డర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రాం గోపాల్ వర్మ

అవాంతరాలను అధిగమించి మర్డర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రాం గోపాల్ వర్మ

గతంలో ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమృత మర్డర్ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ నల్గొండ కోర్టును ఆశ్రయించారు . దీంతో నల్గొండ కోర్టు వర్మకు షాకిస్తూ సినిమాకు బ్రేక్ వెయ్యాలని ఆదేశించింది . కోర్టు నిర్ణయంతో అమృతకు రిలీఫ్ వచ్చినట్టయ్యింది .కానీ కోర్టు అభ్యంతరాలను , అవాంతరాలను అధిగమించి సినిమా ను రిలీజ్ చేస్తునామని చెప్పిన వర్మ తాజా ప్రకటనతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మర్డర్ సినిమా రిలీజ్ తోపాటుగా మిర్యాలగూడలో కూడా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.

22 న మిర్యాల గూడ లో ప్రెస్ మీట్ .. 24 న సినిమా రిలీజ్ .. థియేటర్ లు ధ్వంసం చేసినా సరే

22 న మిర్యాల గూడ లో ప్రెస్ మీట్ .. 24 న సినిమా రిలీజ్ .. థియేటర్ లు ధ్వంసం చేసినా సరే

థియేటర్ ను ధ్వంసం చేసినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పాడు. రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు ఆర్డర్ ఉందన్నారు. రిలీజ్ కు సహకరించమని పోలీసు ఉన్నతాధికారులను కలుస్తామని వర్మ పేర్కొన్నారు. ఎక్కడైతే ప్రణయ్ హత్యకు గురయ్యారో ఆ పట్టణంలోనే అదే సినిమా మీద రాం గోపాల్ వర్మ ప్రెస్ మీట్ పెట్టటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నేపధ్యంలో డిసెంబర్ 22 న రాం గోపాల్ వర్మ మిర్యాలగూడ వస్తే ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది .

మర్డర్ సినిమాపై అమృత తీవ్ర అభ్యంతరం .. సినిమా విడుదల నిలిపివేస్తూ ఆగస్ట్ లో కోర్టు మధ్యంతర స్టే

మర్డర్ సినిమాపై అమృత తీవ్ర అభ్యంతరం .. సినిమా విడుదల నిలిపివేస్తూ ఆగస్ట్ లో కోర్టు మధ్యంతర స్టే

మొదటి నుండీ ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న అమృత ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే తీవ్రంగా సినిమాపై అభ్యంతరం పెట్టారు . వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు . అంతే కాదు గత ఆగస్ట్ నెల ఆరో తేదీన అమృత మర్డర్ సినిమాను ఆపాలని నల్గొండలోని ఎస్సీ , ఎస్టీ కోర్టును ఆశ్రయించారు . తమ అనుమతి లేకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా తీస్తుండడంపై ఆమె తన పిటీషన్ లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు . ఇక దీనిపై కేసు విచారణ జరిపే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.

మర్డర్ పై పంతం నెగ్గించుకుంటున్న వర్మ .. అమృత రియాక్షన్ ఏంటో ?

మర్డర్ పై పంతం నెగ్గించుకుంటున్న వర్మ .. అమృత రియాక్షన్ ఏంటో ?

అమృత పిటీషన్ తో కోర్టు నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలకు నోటీసులు పంపింది. ఇక తాజాగా ఈ సినిమాకు కోర్టు క్లియరెన్స్ ఇవ్వటంతో వర్మ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యారు. ఇప్పటికే మర్డర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల కాగా ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అమృత తన కొడుకు , ఆమె తండ్రి ఉన్నట్టు పోస్టర్ కనిపిస్తుంది. మొత్తానికి ' మర్డర్ ' కుటుంబ కథా చిత్రం విషయంలో వర్మ అనుకున్న పంతం నెగ్గించుకుంటున్నారు. అమృత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి .

English summary
It is known that Rangopal Varma,sensational director, has opened up to another controversy with the movie Murder. RGV has announced 'Murder' the film will be released on the 24th of this month. RGV's announcement that he will hold a press meet for the release of the film on the 22nd of this month in Miryalaguda has now become a hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X