• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘మర్డర్’ కేసులో అడ్డంగా దొరికిన ఆర్జీవీ - కరోనా పాజిటివ్ - అమృత అభ్యంతరం - గందరగోళం

|

వివాదాస్పద 'మర్డర్' సినిమాకు సంబంధించిన కేసును నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మంగళవారం విచారించగా.. తనకు కరోనా సోకినందునే హాజరుకాలేకపోయానని ఆర్జీవీ లాయర్ ద్వారా చెప్పించారు. అయితే ఇది అబద్ధమని పిటిషనర్ అమృత ప్రణయ్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. తనకు కరోనా సోకిందన్న వార్తల్లో నిజం లేదని స్వయంగా దర్శకుడే వెల్లడిచన నేపథ్యంలో ఈ వ్యవహారం జఠిలంగా మారుతుందనుకునేలోపే వర్మ తాజా ప్రకటనలతో ట్విస్ట్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..


అమృత, ప్రణయ్, మారుతీరావు కథాంశంతో వర్మ తెరకెక్కిస్తోన్న 'మర్డర్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీయడం వల్ల తమ జీవితాలు ప్రభావితమవుతాయని, సదరు సినిమాను నిలిపేసేలా ఆదేశాలివ్వాలంటూ అమృత, ప్రణయ్ కుటుంబీకులు నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. అయితే ప్రతివాది వర్మ అఫిడవిట్ సమర్పించకపోవడం మరింత వివాదాస్పదమైంది.

సంచైత మామూలుగా ఇవ్వలేదుగా - కూతుళ్లకు హక్కులపై చంద్రబాబు ట్వీట్.. బాబాయికి చెప్పండంటూ..సంచైత మామూలుగా ఇవ్వలేదుగా - కూతుళ్లకు హక్కులపై చంద్రబాబు ట్వీట్.. బాబాయికి చెప్పండంటూ..

కరోనా వల్లే సంతకం చేయలేదు..

కరోనా వల్లే సంతకం చేయలేదు..

తన క్లయింట్ రాంగోపాల్ వర్మకు కరోనా సోకినందు వల్లే అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని, విచారణను వాయిదా వేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఇది అబద్ధమని, తనకు కరోనా సోకలేదని వర్మ స్వయంగా ప్రకటించారనే విషయాన్ని అమృత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పిస్తామని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. అయితే కోర్టులో తన లాయర్ చెప్పినట్లుగా సర్క్యులేట్ అవుతోన్న విషయాలు అవాస్తవమని వర్మ ట్విస్ట్ ఇచ్చారు.

రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - ‘స్పుత్నిక్-వి' కోలాహలంరష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - ‘స్పుత్నిక్-వి' కోలాహలం

  RGV : తన పై వస్తున్న రూమర్ల పై Ram Gopal Varma అదిరిపోయే సమాధానం!! | Oneindia Telugu
  ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న ఆర్జీవీ..

  ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న ఆర్జీవీ..

  తనకు కరోనా సోకినట్లుగా వచ్చిన వార్తల్ని గతంలోనే ఖండించిన దర్శకుడు ఆర్జీవీ.. తాజాగా కోర్టులో చోటుచేసుకున్న సంఘటనలు కూడా నిజం కావని, కరోనా వల్లే అఫిడవిట్ లో సంతకం చేయలేదన్న వార్తలు ఫేక్ అని ప్రకటించారు. మంగళవారం రాత్రి ఓ హీరోయిన్ తో కలిసి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన ఆయన మరోసారి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. లాయర్ వివరణ, ఆర్జీవీ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉండటంతో గందరగోళం ఏర్పడింది. ఇంకో మూడు రోజుల్లో (14న) జరగబోయే విచారణలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

  English summary
  an advocate of Ram Gopal Varma told Nalgonda SC/ST court that the director tests suffering with covid-19, hence he could not attend hearing. opposing the movie titled Murder, amrutha pranay files petition to stop release of movie.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X