రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముస్లీం ఫ్యామిలీ పుష్కర స్నానం, మంత్రుల హడావుడిగా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అదిలాబాద్: గోదావరి పుష్కరాల్లో ముస్లీం కుటుంబాలు కూడా పవిత్ర స్నానం ఆచరిస్తున్నాయి. అదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం గంజాన్ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబం సోమవారం ఉదయం గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు.

గత పుష్కరాలలో తమ పెద్దలు పుష్కర స్నానం చేశారని వారు చెప్పారు. ఈ పుష్కరాలలో తమ పెద్దలు చేసిన దానిని తాము కొనసాగించామని వారు అన్నారు.

మరోవైపు, పుష్కరాల ప్రత్యేక బాధ్యతలు చేపట్టిన మంత్రులు కేటాయించిన ప్రాంతాల్లో కలియతిరుగుతూ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా పోటెత్తుతున్న ప్రైవేట్ వాహనాల రాకతో ఏర్పడుతున్నను ట్రాఫిక్‌జాంను నివారించేందుకు పోలీస్ డ్యూటీ చేస్తున్నారు. భక్తుల్లో ఒకరిగా కలిసిపోయి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోనే శనివారం రాత్రి మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు బస చేశారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి మండలం గూడెంలోని పుష్కర ఘాట్లను మంత్రులు పరిశీలించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

భక్తులకు ఏర్పాట్లు, వసతుల కల్పనపై సమీక్షించారు. పుష్కర భక్తులకు ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా గూడెంలో పుష్కరఘాట్‌లను పరిశీలించి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

మురికి నీరున్న చోట మోటార్ల ద్వారా తీసివేయాలని ఆదేశించారు. గూడెం, లక్సెట్టిపేటల్లో గోదావరి లోపలికి వెళ్లకుండా జాలీలు ఉండటంతో భక్తులు తక్కువగా వస్తున్నారు. ఈ విషయా న్ని గమనించి తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. అక్కడి నుంచి లక్షెట్టిపేట ఘాట్‌కు వెళ్లి బోట్ ద్వారా కరీంనగర్ జిల్లా కోటిలింగాల రేవుకు వెళ్లారు. అక్కడ భక్తులతో మాట్లాడారు. విజయవాడ నుంచి వచ్చామని, ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని భక్తులు వారితో చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

భక్తులకు అర్ధిక భారం కావొద్దన్న ఉద్దేశంతో సీఎం ఆదేశాల మేరకు ధర్మపురిలో రూ.100 దర్శనం టికెట్లను రద్దు చేయించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు బాసరలోనే రెండు రోజులుగా మకాం వేశారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆదివారం మంత్రి జోగు రామన్న బాసర ప్రధాన ఘాట్‌ను పరిశీలించారు. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు, వసతులపై ఆరా తీసిన అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వెళ్లి గోదావరిలో పుష్క ర స్నానం చేసి వచ్చి బాసర పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు


బాసర రైల్వే స్టేషన్‌ను ఇద్దరు మంత్రులు సందర్శించి భక్తుల రద్దీని పరిశీలించారు. కందకుర్తి క్షేత్రాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. భక్తులు వేలాదిగా కందకుర్తి బస్టాండులో కిక్కిరిసిపోవటాన్ని గమనించిన రెండు గంటలపాటు అక్కడే మైక్‌లో అనౌన్స్‌మెంట్లు చేస్తూ పరిస్థితిని చక్కదిద్దారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

అధికారులు, పోలీసులకు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు చేశారు. బాన్సువాడ, బోధన్ డిపోల నుంచి బస్సులను తెప్పించి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూశారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి భద్రాచలంలో మకాం వేసి పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సూచనలు, సలహాలివ్వడంతోపాటు నేరుగా రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించారు. భద్రాచలం వంతెన వద్ద నుంచి సారపాక వరకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాళేశ్వరంలో వైద్యా రోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్యే బాబు మోహన్ ధర్మపురి వచ్చారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాలకు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దునే ఉండడంతో యావత్మాల్, చంద్రపూర్, గడ్చిరోలి, కిన్వట్, నాందేడ్, నాగ్‌పూర్ నుంచి భక్తులు తరలివస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

చెన్నూర్, మంచిర్యాల ప్రాంతానికి చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల నుంచి భక్తు లు వస్తుండగా నాగ్‌పూర్, యావత్మాల్ ప్రాంతాల నుంచి ఖానాపూర్, సోన్ ప్రాంతాల పుష్కరఘాట్లకు భక్తులు వరుసకట్టారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచి కూడా వస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పుష్కర స్నానం ఆచరించేందుకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన భక్తులు వెంకటాపురం, చర్ల ఘాట్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాయలసీమ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఘాట్లు ఉన్నప్పటికీ భద్రాచలానికి తరలి వచ్చారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

వరంగల్ జిల్లాలోని రెండు ఘాట్లకు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలిస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కాళేశ్వరంలో ఎమ్మెల్యే పుట్ట మధు దగ్గరుండి పుష్కరాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాలు అంటే ఇప్పుడు తెలంగాణలోనే అనేలా గొప్ప పేరు వచ్చిందని భువనగిరి మాజీ ఎంపీ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

English summary
Muslim family take holy dip in Godavari river on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X