హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... క్లారిటీ ఇచ్చిన ఆయన సతీమణి...

|
Google Oneindia TeluguNews

జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంపై ఆయన సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని... మరో వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ముత్తిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న కార్యకర్తలు,అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

హోమ్ క్వారెంటైన్‌లో కుటుంబం..

హోమ్ క్వారెంటైన్‌లో కుటుంబం..

గత కొంతకాలంగా ముత్తిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కరోనా అనుమానంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని పద్మలతా రెడ్డి తెలిపారు. అధికారుల సూచనల మేరకు తమ కుటుంబ సభ్యులంతా కరోనా టెస్టులు చేయించుకున్నామని.. ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం తామంతా హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో జనగామ టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా ఆయన సతీమణి ఓ ప్రకటన చేశారు.

Recommended Video

Hyderabad లో పెరుగుతున్న Corona కేసులు.. టీఆర్ఎస్ MLA కి కూడా..!!
హరీష్ రావు కూడా క్వారెంటైన్..

హరీష్ రావు కూడా క్వారెంటైన్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడ్డ మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డే. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పీఏకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయన హోమ్ క్వారెంటైన్‌ అయ్యారు. సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పనిచేసే వారందరికీ టెస్టులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. సిద్దిపేట కలెక్టర్ కూడా హోమ్ క్వారెంటైన్ అయ్యారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం హోమ్ క్వారెంటైన్ అయ్యారు. మాజీ మంత్రి చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడినప్పటికీ విజయవంతంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

పెరుగుతున్న కేసులు..

పెరుగుతున్న కేసులు..


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విజృంభిసతస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతీరోజూ వందల్లో కేసులు,ఐదుకు తగ్గకుండా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ వాసుల్లో భయాందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ తప్పదన్న చర్చ కూడా మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ.. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందన్నారు. మరో 2,3 రోజుల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులు ధరిస్తూ స్వీయ నియంత్రణలో ఉండాలని అధికారులు,నేతలు సూచిస్తున్నారు.

English summary
TRS Janagaon MLA Muthireddy Yadagiri Reddy tested coronavirus positive on Friday.Now,he is getting treatment in a hospital in Hyderabad,said his wife through a whatsapp voice message.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X