హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్కార్పియో వాహనమే కొంపముంచింది, సినీఫక్కిలో ముత్తూట్ దొంగలను పట్టుకొన్నారిలా...

దేశ వ్యాప్తంగా పలుచోట్ల ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీల్లో దోపిడీలు చేసిన అనుభవం ఉన్నవారిని సైబరాబాద్ పోలీసులు పట్టుకొన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠాను అతి చాకచక్యంగా పోలీసులు పట్టుకొని జైల్లో నెట్టారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలుచోట్ల ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీల్లో దోపిడీలు చేసిన అనుభవం ఉన్నవారిని సైబరాబాద్ పోలీసులు పట్టుకొన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠాను అతి చాకచక్యంగా పోలీసులు పట్టుకొని జైల్లో నెట్టారు.

మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాన్ని దొంగలు దోచుకొన్నారు. సిబిఐ అధికారులమంటూ కార్యాలయంలోకి చొరబడి బంగారాన్ని దోచుకెళ్ళారు.

గత ఏడాది డిసెంబర్ 28వ, తేది ఉదయం 9.40 గంటలకు రామచంద్రాపూరం బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. 48 కిలోల బంగారాన్ని దోచుకొన్నారు.

ఈ కేసులోని పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరహ దొంగతనాలు చేస్తూ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా ఉన్నవారిని సైబరాబాద్ పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకొన్నారు.

హోళికట్టలో మకాం

హోళికట్టలో మకాం

గత ఏడాది డిసెంబర్ 28వ, తేదిన ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాన్ని దోచుకొన్న దొంగలంతా శంకర్ పల్లి మార్గంలో పారిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ మీదుగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కస్తూర్ పల్లిని దాటి కర్ణాటకలోని హోళికట్టకు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకొన్నారు. అక్కడే విజయ్ కుమార్ కు ఉన్న బండరాళ్ళ తయారీ పరిశ్రమలో మకాం వేశారు. అయితే నలుపురంగు స్కార్పియోను సైబరాబాద్ పోలీసులు గుర్తించారని తెలుసుకొని అక్కడి నుండి మకాన్ని మార్చారు.

బంగారాన్ని కరిగించారు

బంగారాన్ని కరిగించారు

విజయ్ కుమార్ బండరాళ్ళ పరిశ్రమ నుండి మకాంను ఎత్తేసి వాడీ జంక్షన్ లో రైలు ఎక్కి నాసిక్ కు పారిపోయారు. అయితే నల్లరంగు కారును విజయ్ కుమార్ ఫ్యాక్టరీలోనే వదిలేసివెళ్ళారు. పోలీసులు వెంబండించినా దొరకకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో నాసిక్ వరకు రైలులో వెళ్ళకుండా మద్యలోనే దిగిపోయారు. తాము దిగిన ప్రాంతానికి కార్లను తెప్పించుకొని నాసిక్ వెళ్ళారు. అక్కడ పాటిల్ ఇంట్లోనే బంగారాన్ని కరిగించి కడ్డీలుగా మార్చారు.

నలుపురంగు స్కార్పియో కోసం వచ్చి

నలుపురంగు స్కార్పియో కోసం వచ్చి

దోపిడికి పాల్పడిన దొంగలు తాము దోపిడికి ఉపయోగించిన నలుపురంగు స్కార్పియోను తప్పించాలని భావించారు. దీంతో పోలీసుల దర్యాప్తును మీడియాలో చూసిన దొంగలు ఆశ్చర్యానికి గురయ్యారు. స్కార్పియోను హొళికట్ట నుండి తప్పించాలని భావించారు. పాటిల్, విజయ్ కుమార్ ను తీసుకొని లక్ష్మన్ జనవరి 3న, డస్టర్ వాహనంలో హోళికట్టకు వచ్చారు. ఆ రోజు మద్యాహ్నం సమయంలో స్కార్పియోను దాచి ఉంచిన ప్రాంతంలోనే రాత్రివరకు ఉన్నారు. రాత్రి సమయంలో స్కార్పియోను స్థావరం నుండి తీసుకొని వెళ్ళాలనుకొన్నారు. నాసిక్ తీసుకెళ్ళడం లేదా ఎక్కడైనా ఆ కారును వదిలివెళ్ళాలని ప్లాన్ చేశారు.

ఇలా దొరికారు

ఇలా దొరికారు

ముందుగా అనుకొన్న ప్రకారంగా లక్ష్మణ్ , విజయ్ కుమార్ డస్టర్ వాహనంలో స్థావరం నుండి బయలుదేరివెళ్ళారు. తాము వెళ్ళే మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుంటే సమాచారం అందిస్తూ ఉంటామని చెప్పారు. అప్పుడు స్కార్పియో వాహనాన్ని తీసుకురావాలని పాటిల్ కు సూచించారు. స్కార్పియోలో పాటిల్ బయలుదేరాడు. హోలికట్ట రోడ్డుపై నిలబడి వాహనాలను పరిశీలిస్తున్న ఇన్స్ పెక్టర్ కు ఓ నలుపురంగు స్కార్పియో కంటపడింది. ఆ సమయంలో తాము వెతుకుతున్న వాహనం అదే కావడంతో సిఐ అప్రమత్తమయ్యారు. ఓ ద్విచక్రవాహనదారుడిని సిఐ లిఫ్ట్ అడిగారు. స్కార్పియోను వెతుకుతూనే మరో వైపు సైబరాబాద్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. 40 నిమిషాలపాటు స్కార్పియోను వెంబడించాడు సిఐ.కర్ణాటక పోలీసు అధికారులతో సైబరాబాద్ అధికారులు మాట్లాడారు. స్థానిక డిఎస్పీని సిఐ వద్దకు సహయంగా పంపారు.

వాహనం పంక్చరై చిక్కారిలా

వాహనం పంక్చరై చిక్కారిలా

కర్ణాటక పోలీసులు సైబరాబాద్ ఇన్స్ పెక్టర్ కు తోడుగా వచ్చారు. అయితే దీంతో నలుపురంగు స్కార్పియోను ఆపాలని భావించారు. అయితే స్కార్పియో ఆగిపోయింది. నలుపురంగు స్కార్పియో కంటే ముందు వెళ్తున్న డస్టర్ కారు పంక్చరైంది. దీంతో స్కార్పియోను కొద్దిసేపు నిలుపుకోవాలని లక్ష్మణ్ కు సూచించాడు పాటిల్. పాటిల్ ను విచారించిన కొద్దిసేపటికే ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడికి పాల్పడింది వీరేనని ఇన్స్ పెక్టర్ గుర్తించాడు. లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొన్నారు. అదే సమయంలో పాటిల్ లక్ష్మణ్ కు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో డస్టర్ వాహనంలోనే పాటిల్ వెనక్కు తిరిగివచ్చారు. మార్గమధ్యలోనే స్కార్పియోను గుర్తించారు.అప్పటికే అక్కడికి చేరుకొన్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. దీంతో ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడికి పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Cyberabad police arrested Muthoot finance thieves through by Scorpio vehicle.Cyberabad police arrested laxman with black colour scorpio in Karnataka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X