• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెల్లెలు కవితకు మనస్పూర్తిగా ధన్యవాదాలు: పవన్ కల్యాణ్ ట్వీట్..

|

హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టమే. నిన్నటిదాకా శత్రువులుగా ఉన్నవాళ్లు ఒక్కసారిగా మిత్రులైపోవచ్చు.. మిత్రులు కాస్త శత్రువులుగానూ మారిపోవచ్చు. విభజన హామిలపై ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్న నేపథ్యంలో.. పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఎంపీ కవిత ఆంధ్రప్రదేశ్ కు మద్దతుగా పార్లమెంటులో తన గళం వినిపించడం.. అందుకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'చెల్లెలికి థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అదే కొంపముంచింది: బీజేపీ ఇంతలా మొండికేయడానికి టీడీపీ, వైసీపీలే కారణం?అదే కొంపముంచింది: బీజేపీ ఇంతలా మొండికేయడానికి టీడీపీ, వైసీపీలే కారణం?

చెల్లెలు కవితకు థ్యాంక్స్:

'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. ' అంటూ పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ కల్యాణ్ ట్వీట్ కు నెటిజెన్స్ నుంచి కూడా సానుకూల స్పందన వస్తుండటం విశేషం.

 కవిత స్పీచ్..:

కవిత స్పీచ్..:

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటిని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. సుమారు

బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా.. ఆమె ఏపీ విభజన హామిల ప్రస్తావనను లేవనెత్తారు. 'ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సభలో ఆందోళన చేస్తుండడం కేంద్రానికి మంచిది కాదు. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది.' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

 'జై ఆంధ్రా' అన్న కవిత:

'జై ఆంధ్రా' అన్న కవిత:

సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. ఏపీ హక్కుల కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న డిమాండ్‌ న్యాయమైనదిగా చెప్పారు. తన ప్రసంగం చివరలో 'జై ఆంధ్రా' అంటూ కవిత నినదించడం కూడా చాలామంది ఏపీ ప్రజలను ఆకట్టుకుంది. బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఏపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పవన్ దానికి కట్టుబడి ఉండగలరా?: 'జేఏసీ' అలా నిగ్గదీసి అడిగితే ఎటువైపు నిలబడతారు?పవన్ దానికి కట్టుబడి ఉండగలరా?: 'జేఏసీ' అలా నిగ్గదీసి అడిగితే ఎటువైపు నిలబడతారు?

 జేఏసీ ఏర్పాటుకై పవన్..:

జేఏసీ ఏర్పాటుకై పవన్..:

ఏపీ విభజన హామిల అమలుపై రాజకీయ పార్టీలు ద్వంద్వ విధానాలను అనుసరిస్తుండటంతో.. జేఏసీని ఏర్పాటు చేయాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్న సంగతి తెలిసిందే. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రా మేదావుల చలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారితో జేఏసీ ఏర్పాటుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు.

English summary
Pawan Kalyan tweeted on MP kavita 'I thank you from the bottom of my heart. “Chellelu Kavitha gariki”(TRS -MP)👏👏 for her support to the people of AP regarding the “pledged words & promises“made by the centre in the Parliament at the time of state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X