వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో మునుగోడు నుండి నా భార్య పోటీ, అవసరమైతే సీటు మార్పు: కోమటిరెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ: 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులు తాము పోటీ చేసే స్థానాలను మార్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో సిఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. మరో వైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ తాను పోటీ చేసే స్థానాన్ని మార్చుకోనున్నట్టు ప్రకటించారు. భువనగిరి ఎంపీ స్థానం నుండి లేదా మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని కోమటిరెడ్డి సోదరులు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి సోదరులు తమ స్థానాలను మార్చుకోవాలని భావిస్తున్నారు. నల్గొండ మున్సిఫల్ చైర్ పర్స,న్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ఇటీవల కాలంలో హత్యకు గురయ్యాడు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావిస్తున్నారు. నల్గొండ అసెంబ్లీ స్థానానికి బదులుగా పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

అన్న బాటలోనే తమ్ముడు

అన్న బాటలోనే తమ్ముడు


2019 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు సిఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. మరో వైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ భువనగరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. భువనగిరి ఎంపీ స్థానం లేకపోతే మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు బుదవారం నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని ప్రకటించారు. అవసరమైతే మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు.

నా భార్య కూడ పోటీకి రెడీ

నా భార్య కూడ పోటీకి రెడీ


తాను భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తే తన సతీమణి మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే కోమటిరెడ్డి కుటుంబం నుండి మరోకరు రాజకీయాల్లోకి రానున్నారని తేటతెల్లమైంది.

నల్గొండ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు

నల్గొండ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బిసి అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపే అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

రాజగోపాల్ రెడ్డి కుమారుడు కూడ రంగంలోకి

రాజగోపాల్ రెడ్డి కుమారుడు కూడ రంగంలోకి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు కూడ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో రాజగోపాల్ రెడ్డి కొడుకు కూడ సభలో పాల్గొన్నారు. అయితే మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి తనయుడు బరిలోకి దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. కానీ రాజగోపాల్ రెడ్డి తనయుడు కాకుండా ఆయన సతీమణిని బరిలోకి దించనున్నట్టు రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టించింది.

English summary
Former Bhuvanagiri Mp Komatireddy Rajagopal Reddy announced that I will contest Bhuvanagiri Parliment segment or Munugode assembly segment in 2019 elections on Wednesday at Nuthankal .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X