హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ మృతిపై అనుమానాలు: డబ్బుల కోసం మిత్రుల పనే?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులోని జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

డబ్బులు లేవని మొదట చెప్పిన పోలీసులు ఆ తర్వాత ఉన్నాయన మర్నాడు చెప్పా‌రు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. కృష్ణవర్ధన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.

 ఆ రోజు ఇలా జరిగింది...

ఆ రోజు ఇలా జరిగింది...

హైదరాబాదులోని బోడుప్పల్‌కు చెందిన కృష్ణవర్ధన్ (26) రామంతపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి భోజనం చేసిన తర్వాత హడావిడిగా ఫోన్‌లో మాట్లాడుత బయటకు వెళ్లాడు.

 వెళ్లినవాడు వెళ్లినట్లే...

వెళ్లినవాడు వెళ్లినట్లే...

ఆ రోజు రాత్రి బయటకు వెళ్లిన కృష్ణవర్ధన్ అదే రోజు ఆర్థరాత్రి జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాల సమపంలోని కంకరరాళ్లపై మరణంచి కనిపించాడు. ఓ రైల్వే ఉద్యోగి శవాన్ని చూసి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు. 15వ తేదీ తెల్లవారు జామున ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

 కుటుంబ సభ్యుల అనుమానం ఇదీ...

కుటుంబ సభ్యుల అనుమానం ఇదీ...

కృష్ణవర్ధన్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉందని, స్నేహితులే అతన్ని చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన కవర్ లభించలేదని పంచనామా రిపోర్టులో రాశారు. అయితే, బంధువుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలు రావడో మర్నాడు కవర్ లభించిందని అంగీకరించారు.

ఆ అవసరం అతనికి లేదు..

ఆ అవసరం అతనికి లేదు..

బోడుప్పల్ నుంచి రాణిగంజ్‌కు వెళ్లాల్సిన అవసరం తన తమ్నుడికి లేదని కృష్ణవర్ధన్ సోదరుడు హరికృష్ణ అంటున్నాడు కృష్ణవర్ధన్ వద్ద ఉన్న నగదు ఏమైందనేది ప్రశ్నగా మిగిలింది. అతడు ఎలా చనిపోయాడనేది తేలాల్సి ఉంది.

English summary
Mystery surouded on techie Krishnavardhan death, took place at james street in Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X