వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్ వ్యతిరేకించొచ్చు, చిరు కొందరివాడే అన్నాను, పవన్ కళ్యాణ్ వెంటే!: నాగబాబు

మెగా అభిమానులు రాజకీయాల పరంగా తన అన్నయ్య చిరంజీవిని వ్యతిరేకించి ఉండవచ్చునని, కానీ సినిమా పరంగా ఆయన వైపే ఉన్నారని ఆయన సోదరుడు నాగబాబు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెగా అభిమానులు రాజకీయాల పరంగా తన అన్నయ్య చిరంజీవిని వ్యతిరేకించి ఉండవచ్చునని, కానీ సినిమా పరంగా ఆయన వైపే ఉన్నారని ఆయన సోదరుడు నాగబాబు అన్నారు. తద్వారా రాజకీయాలకు, సినిమాలకు తెలుగు ప్రజలు, అభిమానులు వేర్వేరుగా చూశారని అభిప్రాయపడ్డారు.

<strong>చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక</strong>చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

చిరంజీవి అందరి వాడని, ఖైదీ నెంబర్ 150 సినిమాను కూడా అందరూ ఆదరించారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వెళ్తే కొందరివాడు అవుతాడని తాను గతంలో అన్నానని గుర్తు చేశారు. సినిమాల్లో మాత్రం వేరని చెప్పారు. పీఆర్పీ వైఫల్యంలో తన బాధ్యత కూడా ఉందని చెప్పారు.

nagababu

కాగా, చిరంజీవి ఓ వైపు రాజకీయాలు కొనసాగిస్తూనే సినిమాల్లోకి ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. 2019 నాటికి మరో రెండు మూడు సినిమాలు తీసే అవకాశాలున్నాయి.

తాను సినిమాలు తీస్తూనే కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉంటానని చిరంజీవి గతంలోనే చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీకి ముఖ్యమైన కంపెయినర్. ఆలోగా సినిమాలు తీసి.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.

<strong>అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!</strong>అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!

మరోవైపు, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల తర్వాత ఆపేసి.. రాజకీయాల్లో కీలకం కానున్నారు. ఇప్పటికే ఆయన 2019 టార్గెట్‌గా.. ముందుకు కదులుతున్నారు. ఏపీలోని సమ్యల పైన వరుసగా స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో జగన్ పైన పైచేయి సాధించే ప్రయత్నాలు జనసేన చేస్తోంది.

ఇదీ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తాను త్వరలో ఓ ప్రోగ్రాం చేస్తానని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజీ పడని వ్యక్తి, నష్టపోయినా పోరాడే తత్వం గలవాడన్నారు. కమ్యూనిజం, క్యాపిటలిజం, తత్వశాస్త్రాలను చదివారన్నారు. ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్ అన్నారు.

పవన్ ఒకచోట ఇమడలేక సమాజానికి ఏదో చెయ్యాలని భావించాడన్నారు. అందుకే జనసేన పార్టీని స్థాపించారని చెప్పారు.

రాజకీయాల్లో ఏదైనా చెయ్యాలనిపిస్తే అధి జనసేన ద్వారానే చేస్తానని, పవన్‌కు తన చేతనైన సాయం చేస్తానని అన్నారు. తద్వారా తాను అన్నయ్యతో పాటు కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పిన నాగబాబు.. ఇప్పుడు పవన్‌కు సాయం చేస్తానని చెప్పి, చిరుకు షాకిచ్చారని చెప్పవచ్చు.

English summary
Nagab Babu said on that Chiranjeevi is Kondarivadu in politics!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X