వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగం కాంగ్రెస్‌లో చేరుతారా: ఆయనేమంటున్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన దానికి వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను బిజెపిలోనే ఉంటానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులకు చెప్పారు.

తాను కాంగ్రెసులోకి వెళ్లే ముచ్చటే లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. కావాలనే కొందరు నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి సభ్యుడిగానే తాను కొనసాగుతానని అన్నారు.

Nagam Janardhan Reddy says he will not join in Congress

గత కొంత కాలంగా ఆయన బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. దానిపై ఆయన స్పందించారు. తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పి ఆయన తెలంగాణ పేర ఓ సంస్థను ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఆయన బిజెపిలో చేరారు. అయితే, బిజెపిలో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే ప్రచారం కూడా ఉంది. బిజెపి సమావేశాలకు కూడా ఆయన వెళ్లడం లేదని అంటున్నారు.

English summary
BJP leader Nagam Janardhan Reddy has clarified that he will not defect into Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X