వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌కు కొత్త అర్థం ఇదేనట: దాడిపై కెసిఆర్‌ను ఏకేసిన నాగం(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదేనా టీఆర్ఎస్ మార్క్ రాజకీయం అంటూ ఆ పార్టీ నాయకులను నిలదీశారు.

టిఆర్ఎస్ అంటే 'తెలంగాణ రజాకార్ల సంఘమా'? అని ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. పిలిచిన టెండర్లులో వ్యవస్థను బ్రేక్ చేసి తన ఇష్టం వచ్చినట్లు.. తన క్యాంపు ఆఫీస్ లో కూచొని పనులు పంచుతున్నాడని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

గతంలో అంచనాకన్నా 30 శాతం తక్కువ మొత్తాలకు టెండర్లు వస్తుండేవని, ఇప్పుడు కేవలం 2 శాతం తక్కువకు టెండర్లు వేసిన సంస్థలకు పనులు అప్పగిస్తున్నారని విమర్శించారు. మెగా, నవయుగ కంపెనీలకు అక్రమ మార్గాల్లో పనులు అప్పగించారని ఆరోపించారు.

Nagam lashes out at KCR

తానేమీ సర్వేలకు, భూ సేకరణకు అడ్డు పడలేదని.. టెండర్లలో అక్రమాలపై కోర్టుకు వెళితే, తాను అభివృద్ధికి అడ్డు పడుతున్నట్టు అభాండాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. 80 వేల కోట్ల పనుల్లో రూ. 75 వేల కోట్లను ఆంధ్రోళ్లకు అప్పగించారని విమర్శించారు. ఇప్పటివరకూ భూ సేకరణేకాని ప్రాజెక్టులను 36 నెలల్లో ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.

దోచి పెట్టడానికి ఆంధ్ర కాంట్రాక్టర్స్ కావలి కానీ దోపిడీని ప్రశ్నిస్తే మాత్రం ఆంధ్ర లాయర్ ఉండొద్దా? అని కేసీఆర్‌ని ప్రశ్నించారు. తెలంగాణ రజాకార్ల సంఘంగా టిఆర్ఎస్ తయారయ్యిందని మరోసారి ఎద్దేవా చేశారు. 'కాంట్రాక్టర్స్ దోపిడీ‌లో సగం నీదే.. నీ దాడులకు బయపడను' అని నాగం స్పష్టం చేశారు. 'కేవలం 4 ప్యాకేజీల మీద మాత్రమే కోర్ట్ వెళ్లిన.. మరి మిగిలిన 14 ప్యాకేజీల పని ఎందుకు ఆగింది' అని నాగం నిలదీశారు.

'నీ దోపిడీని ప్రశ్నించాను, కానీ ప్రాజెక్ట్ లు అడ్డుకోలేదన్నారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌లో తప్పుడు, అనైతిక కథనాలు రాస్తున్నారన్నారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తే ఊరుకొను' అని నాగం హెచ్చరించారు. తాను
1969లో తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పారు.

Nagam lashes out at KCR

రాష్ట్ర ప్రభుత్వం తమకు రక్షణ ఇవ్వలేక పోతే కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. సీఎంకు లేఖ రాస్తే ఉలుకు పలుకు లేదని ఆరోపించారు. తన తదుపరి లక్ష్యంగా 'నీ సెకండ్ అవినీతి మిషన్ భగీరాథ మీదే' అని కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. మిషన్ భగీరథలో అవినీతి గలగలా పారుతోందని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.

అవినీతి లేని దినం కెసిఆర్ చరిత్రలో లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టినా, బీజేపీ, సుష్మ వల్లనే బిల్లు పాస్ అయిందని నాగం గుర్తు చేశారు. తనపై జరిగిన దాడిపై సోమవారం గవర్నర్, డీజీపీ , సీఎస్‌ను కలుస్తామన్నారు.

English summary
Bharatiya Janata Party leader Nagam Janardhan Reddy on Sunday lashed out at Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X