• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగర్ ఉప ఎన్నికలో షాక్: 17 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ -బీజేపీ రెబల్ నివేదితా రెడ్డిది కూడా -యూటర్న్

|

ప్రతిష్టాత్మక నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారంతో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తంగా దాఖలైన నామినేషన్లు, వాటిలో సరైనవి, తిరస్కరణకు గురైనవాటి వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ ఏర్పాట్ల వివరాలనూ వెల్లడించారు. సాగర్ టికెట్ విషయంలో బీజేపీలో తలెత్తిన గందరగోళం ముగింపు దశకు చేరింది. వివరాల్లోకి వెళితే..

జగన్ సర్కార్ మరో భూదందా -ఇళ్ల పట్టాల అసలు కథ -నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్: వైసీపీ ఎంపీ రఘురామజగన్ సర్కార్ మరో భూదందా -ఇళ్ల పట్టాల అసలు కథ -నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్: వైసీపీ ఎంపీ రఘురామ

 17 నామినేషన్లు తిస్కరణ..

17 నామినేషన్లు తిస్కరణ..

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మొత్తం 77 మంది అభ్యర్థుల నామినేషన్లకు స్క్రూటినీ పూర్తి అయింది. 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బీజేపీ రెబల్ అభ్యర్థి నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 60 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ జరిగింది. కాగా,

బరిలో 60 మంది ఉంటారా?

బరిలో 60 మంది ఉంటారా?

ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ సహా 60 మంది నామినేషన్లకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. అయితే, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా ఎవరైనా వెనక్కి తగ్గకపోతే బరిలో 60 మంది నిలిచినట్లవుతుంది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుండగా...మే 2న కౌంటింగ్ జరుగనుంది. నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో ఆయా అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాగా,

1000 మందికి ఒక పోలింగ్ స్టేషన్

1000 మందికి ఒక పోలింగ్ స్టేషన్

కరోనా రెండోసారి వ్యాప్తి తీవ్రంగా సాగుతోన్న దరిమిలా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణపై ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 346 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆర్వో రోహిత్ సింగ్ చెప్పారు. కరోనా నేపథ్యంలో 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రం, గతంలో కంటే 53 పోలింగ్ కేంద్రాలు పెంచినట్లు వివరించారు. ఏప్రిల్ 17న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, విజిల్ యాప్ ద్వారా స్వీకరించి పరిష్కరిస్తామని ఆర్వో రోహిత్ సింగ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..

 మనసు మార్చుకున్న నివేదితా రెడ్డి

మనసు మార్చుకున్న నివేదితా రెడ్డి

సాగర్ స్థానంలో బీజేపీ టికెట్ వ్యవహారం ఆ పార్టీలో రచ్చకు దారింది. గతంలో కమలం గుర్తుపై పోటీచేసిన నివేదితా రెడ్డి, కీలక నేత కడారి అంజయ్యలను కాదని బీజేపీ అధిష్టానం డాక్టర్ రవికుమార్ కు టికెట్ కట్టబెట్టింది. దీంతో ఆగ్రహించిన అంజయ్య మంగళవారమే సీఎం కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. నివేదిత రెడ్డి కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగినా, చివరికి ఆమె మనసు మార్చుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో నివేదిత భేటీ అయ్యారు. కడారి అంజయ్య టీఆర్ఎస్‌లో చేరడంతో రాబోయే సాధారణ ఎన్నికల్లో తనకే సాగర్ టికెట్ వస్తోందని నివేదితారెడ్డి భావిస్తున్నారు. నివేదితారెడ్డి భర్త శ్రీధర్‌రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

పాక్-భారత్ బంధం ఇంకాస్త తియ్యగా -చక్కెర, పత్తి, మరో 21 వస్తువులపై నిషేధం ఎత్తివేత -మోదీకి ఇమ్రాన్ లేఖపాక్-భారత్ బంధం ఇంకాస్త తియ్యగా -చక్కెర, పత్తి, మరో 21 వస్తువులపై నిషేధం ఎత్తివేత -మోదీకి ఇమ్రాన్ లేఖ

English summary
The scrutiny for the nominations of a total of 77 candidates in the Nagarjunasagar by-election has been completed. Nominations of 17 candidates were rejected. The nominations of the remaining 60 candidates were approved by the authorities. Nagarjuna Sagar by-election will be held on April 17 and counting will be held on May 2. Nivedita Reddy, frustrated with the prospect of a BJP ticket, has dropped the idea of ​​joining the TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X