• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ నేత జానారెడ్డి ట్విస్ట్ -నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోటీపై షాకింగ్ కామెంట్స్

|

అతి త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైనప్పటికీ.. పోటీ నుంచి తప్పుకుంటానంటూ ఆయన ప్రకటించడం, వారసత్వ రాజకీయాలపై ఆయన చేసిన కామెంట్లు పార్టీలో కలకలం రేపుతున్నాయి..

అసెంబ్లీలో పోర్న్ వీడియో వీక్షణం -కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిర్వాకం -ఆ బీజేపీ నేతకు డిప్యూటీ సీఎం పోస్టుఅసెంబ్లీలో పోర్న్ వీడియో వీక్షణం -కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిర్వాకం -ఆ బీజేపీ నేతకు డిప్యూటీ సీఎం పోస్టు

 100 కుటుంబాలు చేరిక..

100 కుటుంబాలు చేరిక..

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఊపు మీదున్న బీజేపీ.. సాగర్ సీటును ఎలాగైనా గెలుచుకునే దిశగా పావులు కదుపుతుండటం, ఆ స్థానంలో కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డిని తమవైపునకు లాక్కోవడమో, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడమో చేయాలని బీజేపీ యత్నించినట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని జానారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని తానే అని జానా చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తోన్న జానారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి.

జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడ్ మండలానికి చెందిన చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని వివరిస్తూ, ఆఖర్లో తన అభ్యర్థిత్వంపై ట్విస్టింగ్ కామెంట్లు చేశారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్, హాలియాలో జూనియర్ ఇంటర్, ఐటిఐ కాలేజీల ఏర్పాటు, చలకుర్తిలో నవోదయ స్కూల్, నాగార్జున సాగర్ లో బీఈడీ కాలేజీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు.. వీటన్నింటి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. కాగా..

 కొడుకు లేదా అనుచరులకు టికెట్..

కొడుకు లేదా అనుచరులకు టికెట్..

‘‘వారసత్వ రాజకీయాలకు నేను పూర్తి వ్యతిరేకం. కానీ అనుచరులు అందరూ.. నా కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందామని అడుగుతున్నారు. మరి నాయకుడంటే అనుచరుల మాట వినాల్సిందే కదా! అనుచరులు కోరినట్లుగానే సాగర్ లో నా కొడుకుని పోటీ చేయిస్తా.. లేదంటే నా ప్రధాన అనుచరుల్లో ఒకరిని బరిలోకి దిపడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను'' అని జానారెడ్డి అన్నారు. రఘువీర్ రెడ్డిపై బీజేపీ కన్నేసిన నేపథ్యంలో జానా వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సాగర్ లో పోటీకి విజయశాంతి పేరును కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా -ఆ ఘనత వైఎస్సార్‌‌దే: విజయవాడ పర్యటనలో జగ్గారెడ్డి కామెంట్స్రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా -ఆ ఘనత వైఎస్సార్‌‌దే: విజయవాడ పర్యటనలో జగ్గారెడ్డి కామెంట్స్

English summary
telangana congress senior leader, former minister kunduru jana reddy made surprising comments on upcoming nagarjuna sagar assembly by elections. buffering with congress high command decision, jana reddy said that his son raghuveer or any of his fallower would be the candidate for by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X