హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయశంకర్‌కు నివాళి: 'ఎన్టీఆర్ ఆంధ్రోడయినా, చాలా మంచోడు' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ను టీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఆయన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా, తెలంగాణ మేలు కోరుకున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం ఇక్కడ జయశంకర్‌ స్టడీ సర్కిల్‌ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలపై 610 జీవో తీసుకువచ్చారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు. తెలంగాణ నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆనాడే ఎన్టీఆర్‌ గుర్తించి జీవోను జారీ చేశారని గుర్తు చేశారు.

ఇక సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ సమయంలో సలహాలు ఇస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్‌ గొప్ప మహనీయుడని కొనియాడారు. దివంగత సీఎం చెన్నారెడ్డి సైతం తెలంగాణ ఉద్యమాన్ని చురుకుగా కొనసాగించారని, ఆయన చేసిన పోరాటానికి ఎవరూ సాటిరారని తెలిపారు.

 ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మహోపాధ్యాయ ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రూపకల్పనలో ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకెళుతున్నామని చెప్పారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జయశంకర్‌సార్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ పురోగతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారని చెప్పారు.

 ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

తమ ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఫలితాలు వెలుగుచూసిన తర్వాత తమ పనితీరు సంగతి ప్రతిపక్షాలకు తెలుస్తుందన్నారు. పలువురు మహిళలు కూడా టీఆర్‌ఎస్ భవన్‌లో జయశంకర్‌కు నివాళులర్పించారు.

 ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రోఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్రమంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు ఉన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పార్టీ నేతలు, శ్రేణులు, సామాన్యులు పోటీపడ్డారు.

 ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

మరోవైపు తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గన్‌పార్క్ వద్ద తెలంగాణ జేఏసీలో సంపూర్ణ తెలంగాణ దీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం హాజరయ్యారు. ఆయనతో పాటు జేఏసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద గల ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు.

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాజకీయ పంథాలోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమని నమ్మి, ఆ దిశగా ఉద్యమాన్ని నడపడంతో ప్రొఫెసర్ జయశంకర్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.

English summary
Naini Narsimha Reddy Comments on NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X