హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

7వేలమంది పోలీసులతో నాకాబందీ: 8కేజీలో బంగారం లభ్యం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ చేపట్టారు. 7వేల మంది సిబ్బంది ఆకస్మికంగా బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేశారు.

మొత్తం 90 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారికేడ్లను అడ్డంగా పెట్టుకుని రెండు గంటల పాటు సోదాలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ తోపాటు అధికారులు ఈ తనిఖీల్లో భాగస్వాములయ్యారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, ఎస్‌బీ, ఎస్‌ఓటీ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఇటీవల జరుగుతున్న చోరీలు, అటెన్షన్ డైవర్షన్, చైన్ స్నాచింగ్‌లు అరికట్టేందుకు పోలీసులు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి అనుమానితుల కోసం గాలించారు. అదే విధంగా పలు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌లలో డికాయ్ ఆపరేషన్‌లను కూడా నిర్వహించారు.

సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాదాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ ప్రాంతాల్లో పోలీసు చెకింగ్‌లను పరిశీలించడంతో పాటు ఆయన స్వయంగా పలు వాహనాలు, ఆర్టీసీ బస్సులను సోదాలు చేశారు.

కాగా, బాలానగర్‌లోని ఓ లాడ్జీలో వ్యాపారులు గోపాల్, జితేందర్ సింగ్ వద్ద 8.4కిలోల బంగారం లభించడంతో కలకలం రేగింది. ముంబై నుంచి నగరంలోని వ్యాపారులకు చూపించేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ బంగారాన్ని కమిషనర్ పరిశీలించారు. ఆ బంగారానికి రశీదులున్నా.. పన్ను చెల్లింపు వివరాల కోసం ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నాకాబందీ

నాకాబందీ

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ చేపట్టారు.

నాకాబందీ

నాకాబందీ


7వేల మంది సిబ్బంది ఆకస్మికంగా బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేశారు.

నాకాబందీ

నాకాబందీ

మొత్తం 90 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారికేడ్లను అడ్డంగా పెట్టుకుని రెండు గంటల పాటు సోదాలు చేపట్టారు.

నాకాబందీ

నాకాబందీ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ తోపాటు అధికారులు ఈ తనిఖీల్లో భాగస్వాములయ్యారు.

నాకాబందీ

నాకాబందీ

లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, ఎస్‌బీ, ఎస్‌ఓటీ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

నాకాబందీ

నాకాబందీ

ఇటీవల జరుగుతున్న చోరీలు, అటెన్షన్ డైవర్షన్, చైన్ స్నాచింగ్‌లు అరికట్టేందుకు పోలీసులు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి అనుమానితుల కోసం గాలించారు.

నాకాబందీ

నాకాబందీ

అదే విధంగా పలు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌లలో డికాయ్ ఆపరేషన్‌లను కూడా నిర్వహించారు.

నాకాబందీ

నాకాబందీ

సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాదాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ ప్రాంతాల్లో పోలీసు చెకింగ్‌లను పరిశీలించడంతో పాటు ఆయన స్వయంగా పలు వాహనాలు, ఆర్టీసీ బస్సులను సోదాలు చేశారు.

నాకాబందీ

నాకాబందీ

ట్రిపుల్ రైడింగ్, పత్రాలు లేని వాహనదారులు పోలీసుల తనిఖీలను తప్పించుకుకేందుకు నానా అవస్థలు పడ్డారు.

నాకాబందీ

నాకాబందీ

ఏకంగా డివైడర్‌లను జంప్ చేసి తనిఖీలను తప్పించుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

నాకాబందీ

నాకాబందీ

సరైన పత్రాలు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు పోలీసులు చలానా రాశారు. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

English summary
All wings of Cyberabad commissionerate including as many as 7,000 policemen conducted a Nakabandi progamme throughout the Cyberabad commissionerate limits from 4 pm to 6 pm on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X