వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్మకు షాకిచ్చిన నల్గొండ కోర్టు .. మర్డర్ కు బ్రేక్ , అమృతకు రిలీఫ్

|
Google Oneindia TeluguNews

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమృత మర్డర్ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ నల్గొండ కోర్టును ఆశ్రయించారు . దీంతో నల్గొండ కోర్టు వర్మకు షాకిస్తూ సినిమాకు బ్రేక్ వెయ్యాలని ఆదేశించింది . కోర్టు నిర్ణయంతో అమృతకు రిలీఫ్ వచ్చినట్టయ్యింది .

ఈనెల ఆరో తేదీన అమృత మర్డర్ సినిమాను ఆపాలని నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు . తమ అనుమతి లేకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా తీస్తుండడంపై ఆమె తన పిటీషన్ లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు . ఇక దీనిపై కేసు విచారణ జరిపే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమాకు తాత్కాలికంగా బేక్‌ పడినట్లయింది. అమృత పిటీషన్ తో కోర్టు నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలకు నోటీసులు పంపింది.

సినిమా పబ్లిసిటీ ఆపాలని ,విడుదలను నిలిపివెయ్యాలని అమృత కోర్టును కోరారు . రాం గోపాల్ వర్మ నిర్మాణ భాగస్వామి అయినప్పటికీ ఆయనకు నోటీసులు పంపలేదు. ఆయన పేరు అమృత తన పిటీషన్ లో పేర్కొనలేదు. గతంలో మర్డర్ సినిమా ఫస్ట్ లుక్ సమయంలోనే నీపై ఎలాంటి కేసులు పెట్టను అని రెస్ట్ ఇన్ పీస్ అంటూ రాంగోపాల్ వర్మపై వ్యాఖ్యానించిన అమృత ఈ సినిమాకు చెందిన మిగిలిన నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు . ఇక ఈ సినిమాను త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద , ఆర్టీవీ వరల్డ్‌ టీవీలో రిలీజ్ చెయ్యాలను వర్మ భావిస్తున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్న సమయంలో కోర్టు మర్డర్ సినిమా విషయంలో ఆర్జీవీకి షాక్ ఇచ్చింది.

nalgonda court gave shock to ram gopal varma .. break to murder movie

రాంగోపాల్ వర్మ అమృత ప్రణయ్ ల ప్రేమ కథ, అల్లుడు ప్రణయ్ పరువు హత్య, ఆ తర్వాత మారుతీ రావు ఆత్మహత్య ఇలా జరిగిన సంఘటనలతో 'మర్డర్' సినిమాను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు అంతే హైప్ కూడా క్రియేట్ చేశారు . సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రాగానే అమృత స్పందించారు .

వర్మపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . ఫస్ట్ లుక్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటూ ఆమె వర్మ పై నిప్పులు చెరిగారు. వర్మా .. నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్ తో నా జీవితానికి ఎటువంటి పోలికలు లేవు. సినిమా కోసం నువ్వు ఇంతగా దిగజారుతావు అనుకోలేదు . మా పేర్లను ఉపయోగించుకొని నువ్వు తప్పుడు కథను అమ్ముకోవాలి అనుకుంటున్నావు నిన్ను చూస్తే జాలేస్తుంది అంటూ వర్మపై నిర్ప్పులు చెరిగారు అమృత. ఇక తాజాగా కోర్టును సినిమాను ఆపాలని ఆశ్రయించారు .

English summary
Ramgopal Varma,sensational director, has opened up to another controversy with the movie Murder. Amrutha, had approached the Nalgonda court to stop the movie.court gave shock to Varma and ordered to stop the film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X