• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్:24 గంటలవ్యవధిలో ఇద్దరితో తాళి.. సినిమాను తలదన్నేలా మౌనిక లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ఇలా..

|

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకాశమంత పందిరి వేయలేకున్నా.. వేల మంది అతిథుల్ని పిలవకున్నా.. నిబంధనల మేరకు ఘనంగానే జరిగిందా వివాహం. అమ్మానాన్నల కళ్లలో ఆనందం కోసం.. వాళ్లు చూపించిన అబ్బాయితోనే తలొంచి తాళి కట్టించుకుందా యువతి. తీరా అప్పగింతల వేళ.. ఎదురుగా కనిపించిన యువకుణ్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది.. అగ్నిపర్వతం బద్దలైన తీరుగా బొటబొటా కన్నీళ్లతో బోరున ఏడుస్తూ అతణ్ని కౌగిలించుకుంది.. ఆ సీన్ చూసి పెళ్లికొడుకు షాకయ్యాడు..

కిమ్ జాంగ్ యుద్ధసైరన్, విధ్వంస దృశ్యాలు.. సైన్యానికి సోదరి ఆదేశం.. డెత్ మిస్టరీపై మళ్లీ చర్చ..

శాబ్దులాపూర్ యువతి..

శాబ్దులాపూర్ యువతి..

మారుతున్న కాలానికి అద్దం పట్టేలా, సినిమా స్టోరీని తలదన్నే నిజజీవిత ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలంలో చోటుచేసుకుంది. అక్కడి శాబ్దూలాపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే యువతి.. నాటకీయ పరిణామాల మధ్య 24 గంటల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి విషయంలో ఈ తరం పిల్లలు ఎంత కచ్చితంగా ఉంటున్నారో, వాళ్లను అర్థం చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కూడా మారుతున్నారనడానికి ఉదాహరణగా జిల్లా పోలీసులు చెప్పిన కథనమిది..

అమ్మానాన్నల కోసం..

అమ్మానాన్నల కోసం..

శాబ్దులాపురానికి చెందిన మౌనిక కుటుంబం గడిచిన పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటోంది. చదువు పూర్తికావొచ్చిన దశలో పెళ్లి సంబంధాలు వెదకడం మొదలుపెట్టిన పేరెంట్స్.. చివరికి దేవరకొండకు చెందిన యువకుడితో మౌనికకు లగ్గం కుదిర్చారు. లాక్ డౌన్ కారణంగా హడావుడి లేకుండానే, సమీప బంధువులు, కుల పెద్దల సమక్షంలో శుక్రవారం పెళ్లి జరిపించారు. అమ్మానాన్నల కోసం తలొంచి తాళి కట్టించుకున్న మౌనిక.. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చింది..

అక్కడ ప్రియుణ్ని చూసి..

అక్కడ ప్రియుణ్ని చూసి..

పెద్దల కోసం పెళ్లి చేసుకున్నప్పటికీ.. మౌనిక మనసులో మాత్రం రాజేశ్ దగ్గరే ఉండిపోయింది. కొండభీమనపల్లికి చెందిన రాజేశ్.. మౌనికకు వరుసకు మామ అవుతాడు. చాలా కాలంగా వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, ఈ విష‌యాన్న ఇంట్లో చెప్పేందుకు ఆమె భయపడింది. మౌనిక పెళ్ల‌యిన కొద్దిసేపటికే అక్కడికి ప్రియుడు రాజేశ్ వ‌చ్చాడు. అక్కడ అతణ్ని చూసి.. ఆమె పరుగున వెళ్లి బోరున ఏడ్చింది. అది చూసి, మోసపోయాననే ఉక్రోషంతో పెళ్లి కొడుకు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  Chittoor: కుప్పం వెళ్తూ ప్రమాదానికి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
  చివరికి ప్రేమ పెళ్లి..

  చివరికి ప్రేమ పెళ్లి..

  పెళ్లికొడుకు ఫిర్యాదు మేరకు రెండు కుటుంబాల పెద్దలను పోలీసుల పిలిపించగా.. ఓ సారి తమలో తాము మాట్లాడుకునేందుకు అనుమతి కోరారు. అలా గ్రామంలో పంచాయితీ జరిగింది. పెద్ద మనుషులంతా కలిసి.. పెళ్లిని రద్దు చేసుకునేలా పెళ్లికొడుకును ఒప్పించారు. అదే సమయంలో.. మౌనిక మ‌న‌సు ప‌డ్డ రాజేశ్ తో వెంటనే మరో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. చివరికి తల్లిదండ్రుల ఆశిస్సులతో, రెండు వైపుల బంధువుల సమక్షంలో మౌనిక.. రాజేశ్ చేత తాళికట్టించుకుంది. అలా ఆమె ప్రేమ క‌థ‌కు శుభం కార్డు ప‌డింది.

  English summary
  In a dramatic twist, a young woman married twice within 48 hours in nalgonda district. first marriage was arranged by her parents, second one was with her lover
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more