వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: రాజీనామాను వ్యతిరేకించను, సమర్థించను: సుఖేందర్‌రెడ్డి

రాజీనామాపై వ్యతిరేకించను, సమర్థించనని నల్గొండ ఎంపీ సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.రాజీనామాపై సీఎం నిర్ణయం తీసుకొంటారని చెప్పారు సుఖేందర్ రెడ్డిరాష్ట్ర రైతుల సమన్వయ కమిటీపై మూడు ప్రత్యామ్నాయాలపూ సిఎ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడారు. రాజీనామా విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌దే తుది నిర్ణయమని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. సుఖేందర్‌రెడ్డిని రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా నియమించిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం టిఆర్ఎస్ వర్గాల్లో ఉంది.

Nalgonda MP Gutta Sukhender Reddy responded on resignation.

అయితే ఈ విషయమై సుఖేందర్‌రెడ్డి మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. శుక్రవారం నాడు పాడి పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి తలసాని నిర్వ‌హించిన సమీక్షలో పాల్గొన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ విష‌యంపై మొద‌టిసారిగా స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నాన‌ని వ‌చ్చిన వార్తలను స‌మ‌ర్థించ‌ను, వ్య‌తిరేకించ‌ను అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

త‌న‌ రాజీనామా విష‌యంలో సీఎందే తుది నిర్ణ‌యమ‌ని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఒక‌వేళ‌ తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ త‌ర‌ఫున‌ ఎవ‌రు పోటీ చేస్తార‌న్న దానిపై సీఎం నిర్ణ‌యం తీసుకుంటార‌ని కూడా అన్నారు. కాగా, రాష్ట్ర రైతుల స‌మ‌న్వ‌య క‌మిటీపై ఉన్న‌ మూడు ప్ర‌త్యామ్నాయాలపై కేసీఆర్‌ చ‌ర్చిస్తున్నారని ఆయ‌న అన్నారు.

English summary
Nalgonda MP Gutta Sukhender Reddy responded on resignation. Telangana chief minister KCR will take decision on resignation said Sukhender reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X