• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేటీఆర్‌ను తిట్టిన అధికారి.. 10 కోట్ల నిధులు ఇస్తే.. కోటి మాయం చేస్తానంటూ పిచ్చి కూతలు..!

|

నల్గొండ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ఓ అధికారి రెచ్చిపోయారు. ఇష్టమొచ్చినట్లుగా లూజ్ టాక్ చేసి అడ్డంగా దొరికిపోయారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గ్రామ సమస్యలపై సదరు అధికారికి ఫోన్ చేయగా.. అతడిపై విరుచుకుపడటమే గాకుండా మధ్యలో కేటీఆర్ ప్రస్తావన రావడంతో ఆయనపై కూడా బూతు పురాణం అందుకున్నారు. వారిద్దరికి సంబంధించిన ఆడియో టేప్ బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నల పరంపరను తట్టుకోలేక సదరు అధికారి సహనం కోల్పోయి దూషణకు దిగడం చర్చానీయాంశమైంది.

అధికారి రెచ్చిపోయి మాట్లాడి.. అడ్డంగా బుక్కయారుగా..!

అధికారి రెచ్చిపోయి మాట్లాడి.. అడ్డంగా బుక్కయారుగా..!

నల్గండ జిల్లాలో ఓ అధికారి తీరు చర్చానీయాంశమైంది. గ్రామ సమస్యలపై ఓ వ్యక్తి సదరు అధికారికి ఫోన్ చేస్తే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. అంతేకాదు ఫోన్ చేసిన వ్యక్తిని బెదిరించే లెవెల్లో మాట్లాడిన ఆయన.. మధ్యలో కేటీఆర్ ప్రస్తావన వస్తే ఆయన్ని కూడా ఇష్టమొచ్చినట్లుగా దూషించారు. ఆ అధికారి బూతు పురాణం విని అవతలి వ్యక్తి షాక్ తిన్నాడు. ఏంటీ సార్.. ఇలా మాట్లాడుతున్నారు అని అడిగితే ఏం చేయమంటావు మరి అని తిక్కతిక్కగా మాట్లాడారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో టేప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

గ్రామ సమస్యలపై ఫోన్ చేస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం

గ్రామ సమస్యలపై ఫోన్ చేస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం

ఉమ్మడి నల్గొండ జిల్లా అంగడిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. చండూరుకు చెందిన అధికారికి ఫోన్ చేశారు. ఆయన రెండు శాఖలకు కీలక అధికారిగా ఉన్నారు. సార్, మా ఊళ్లో రోడ్లు బాగా లేవు.. మరమ్మతులు చేయించాలని వేడుకున్నారు సదరు వ్యక్తి. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చిందో ఏమో గానీ ఫోన్ చేసిన వ్యక్తిపై మండిపడ్డారు. అంతేకాదు మధ్యలో కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనపై కూడా తిట్ల పురాణం అందుకున్నారు. ఓ అధికారి అలా మాట్లాడటంతో ఆ వ్యక్తి కంగు తిన్నారు. అదేంటి సార్, మీర్ ఇన్‌ఛార్జ్ అని ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తే నేనంతే అనే లెవెల్లో మాట్లాడిన తీరు వివాదస్పదమైంది.

ఫోన్ చేసిన వ్యక్తిపై దురుసుగా మాట్లాడి..!

ఫోన్ చేసిన వ్యక్తిపై దురుసుగా మాట్లాడి..!

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాల్సిన సదరు అధికారి అలా మాట్లాడటం.. ఆ ఆడియో టేప్ కాస్తా బయటకు రావడం చర్చానీయాంశమైంది. అధికారి హోదాలో ఉండి అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామంలో బోనాల జాతర జరగనుంది.. వీధులన్నీ శుభ్రంగా లేవు.. కాస్తా చూడండి సార్ అని ఫోన్ చేసిన వ్యక్తితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు సదరు అధికారి. నన్నేం చేయమంటావని ఎదురు ప్రశ్నించారు. మీరు ఇన్‌ఛార్జ్ కదా అని మీకు ఫోన్ చేశానంటూ ఆ వ్యక్తి చెబితే దురుసుగా మాట్లాడారు.

మధ్యలో కేటీఆర్‌ను కూడా వదిలిపెట్టలేదుగా..!

మధ్యలో కేటీఆర్‌ను కూడా వదిలిపెట్టలేదుగా..!

చండూరు మున్సిపాలిటీకి ప్రభుత్వం 10 కోట్లు ఇచ్చింది కదా సార్.. మరి బడ్జెట్ లేదా.. ఎందుకలా మాట్లాడుతారంటూ సదరు వ్యక్తి అధికారిని ప్రశ్నించారు. దాంతో ఆయన సహనం కోల్పోయి.. అవునా, పది కోట్లు వచ్చాయా, అయితే అందులో నుంచి ఓ కోటి తెచ్చుకుని నీ ఊరిని అభివృద్ధి చేసుకో అంటూ వెటకారంగా మాట్లాడారు. అంతేకాదు కేటీఆర్ ఏమన్నా నీకు చెప్పిండా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆయన నాకెందుకు చెబుతాడు సార్.. నల్గొండ మున్సిపాలిటీకి వంద కోట్లు.. చండూరు మున్సిపాలిటీకి 10 కోట్లు కేటాయించినట్లు పేపర్ల వచ్చింది కదా సార్ అందుకే అడుగుతున్నానంటూ ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు.

10 కోట్లు ఇస్తే.. ఒక్క కోటి తీసుకుని ఉద్యోగమే చేయను అంటూ..!

10 కోట్లు ఇస్తే.. ఒక్క కోటి తీసుకుని ఉద్యోగమే చేయను అంటూ..!

అలా మాట్లాడుతూనే మధ్య మధ్యలో బూతు పురాణం కూడా అందుకున్నారు ఆ అధికారి. ఎవడెవడో చెప్పిన మాటలు నమ్మి ఎందుకు మాట్లాడతారని అతడిపై గరమయ్యారు. అంతేకాదు ఒక్కడు కూడా ఇంటి పన్ను సక్కగా కట్టలేరు గానీ ప్రతి ఒక్కడు మాట్లాడేటోడే అన్నట్లుగా అతడిపై విరుచుకుపడ్డారు. ఎవడో పేపర్ల రాసిండని నమ్ముడేనా అంటూ దూషణకు దిగారు. కేటీఆర్ ఇచ్చిండట.. 10 కోట్లు వచ్చినాయంట.. ఏందేదో మాట్లాడతారు జనాలు అంటూ తిట్ల దండకం అందుకున్నారు. 10 కోట్ల నిధులు ఇస్తే నాకు ఉద్యోగం చేయాల్సిన ఖర్మేంటి అనే రీతిలో కూడా మాట్లాడారు. అందులో కోటి రూపాయలు తీసుకుని అసలు ఉద్యోగానికే రానంటూ చెప్పుకొచ్చారు.

సదరు అధికారి అలా మాట్లాడేసరికి.. అవతలి వ్యక్తి, సరే సార్ మేము టీఆర్ఎస్ కార్యకర్తలం, మరి ప్రగతి భవన్‌కు వెళ్లి తెలుసుకుని వస్తామంటూ ముగించబోయారు. దాంతో ఆ అధికారి మరింత రెచ్చిపోయి.. హా, పోయిరా.. పోయి ఆ 10 కోట్లు ఎక్కడ పెట్టిండో అడిగి రా అంటూ ఎద్దేవా చేశారు. 10 కోట్లు ఇచ్చినా కూడా ఊళ్లో కనీసం గుంతలు పూడుస్తలేరు, రోడ్లు బాగు చేస్తలేరంటూ నిలదీసి రా పో అంటూ హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు.

English summary
One of Nalgonda District Officer tongue slip on Former Minister and TRS Working President KTR. When a person from the district phoned the officer over the problems of the village. Then the officer loose his patience and scolded him as well as on KTR also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X