వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య ఎలా చేయాలో చెప్పాడు, తండ్రి 'దృశ్యం' సినిమా ప్లాన్ విఫలం: ప్రణయ్ హత్యపై ఎస్పీ రంగనాథ్

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ప్రణయ్‌ను చంపిన బీహార్‌కు చెందిన నిందితుడు సుభాష్ శర్మను అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం రిమాండులోకి తీసుకున్నారు. అతనిని ఇక్కడకు తీసుకు వస్తున్నారు.

Recommended Video

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్

<strong>ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?</strong>ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?

నిందితులు మారుతీ రావు (అమృత తండ్రి)తో పాటు అస్గర్ అలీ, మహ్మద్ బారీ, అబ్దుల్ కరీం, శివ (డ్రైవర్)ను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మీడియా ఎదుట మాట్లాడారు. మారుతి రావు, బాబాయ్ శ్రవణ్, డ్రైవర్ శివతో పాటు ఏఢుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

హత్య చేసింది సుభాష్ శర్మ

హత్య చేసింది సుభాష్ శర్మ

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ అని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కత్తితో ప్రణయ్‌ని చంపేశాడన్నారు. సుభాష్ శర్మది బీహార్లోని సమస్తిపూర్ జిల్లా అని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసేందుకు రూ.కోటి సుఫారీ చెల్లించారని తెలిపారు. అశ్గర్ అలీ.. పాండ్యా హత్య కేసులో నిందితుడు అని తెలిపారు.

హత్య ఎలా చేయాలో చెప్పాడు

హత్య ఎలా చేయాలో చెప్పాడు

హత్య ఎలా చేయాలో మహ్మద్ బారీ సూచనలు చేశాడని ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్ హత్యకు వారు రూ.రెండున్నర కోట్లు అడిగారని తెలిపారు. చివరకు రూ.కోటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. హత్యకు ముందే రూ.15 లక్షలు ముందస్తుగా తీసుకున్నారని చెప్పారు. మహ్మద్ బారీతో మారుతీ రావుకు 2011 నుంచి పరిచయాలు ఉన్నాయని చెప్పారు.

గతంలోను హత్యా ప్రయత్నాలు

గతంలోను హత్యా ప్రయత్నాలు

ఆగస్ట్ 18వ తేదీన బ్యూటీపార్లర్ వద్ద తొలిసారి హత్యా ప్రయత్నం జరిగిందని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో రెండోసారి హత్యకు ప్రణాళిక వేశారన్నారు. పెళ్లయినప్పటి నుంచి ప్రణయ్‌ని అంతమొందించాలనే కసితో మారుతీరావు ఉన్నారని చెప్పారు. హత్య చేసేందుకు అస్గర్ అలీ, శర్మ కలిసి వచ్చారని చెప్పారు. అస్గర్ అలీ ఘటనాస్థలికి దూరంగా ఉండి హత్యను పర్యవేక్షించారని చెప్పారు. పక్కాగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఆసుపత్రి వద్ద కత్తితో దాడి చేశారని తెలిపారు.

దృశ్యం సినిమాలో తప్పించుకునే ప్రయత్నాలు

దృశ్యం సినిమాలో తప్పించుకునే ప్రయత్నాలు

నిందితులకు సంబంధించిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో హత్య జరిగిందన్నారు. అంతకంటే ముందే మారుతీ రావు నల్గొండకు వచ్చారని చెప్పారు. దృశ్యం సినిమాలో మాదిరిగా మారుతిరావు తప్పించుకునే ప్రయత్నాలు చేశారని చెప్పారు. మారుతీ రావు ప్లాన్ విఫలమైందన్నారు.

 ప్రజా ప్రతినిధుల పాత్రలేదు

ప్రజా ప్రతినిధుల పాత్రలేదు

ప్రణయ్ హత్య కేసులో ప్రజాప్రతినిధులపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. పెళ్లి సమయంలో వేముల వీరేశం బెదిరించినట్లు మాత్రమే ఆరోపణలు వచ్చాయన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామితో వేముల వీరేశం మాట్లాడారని చెప్పారు. తనది కులాంతర వివాహమేనని వేముల వీరేశం చెప్పినట్లు కొందరు అన్నారని తెలిపారు.

English summary
Nalgonda SP Ranganath about Miryalaguda Pranay's murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X