గద్దల్లా పెద్దలు: రైతుల భూములపై కన్ను.. జ్యూట్ పరిశ్రమ పేరుతో ఆక్రమణ..? రైతుల దీక్ష
ఎక్కడ భూమి కనిపించిన ఇక అంతే సంగతులు. అక్కడ గద్దల్లా పెద్దలు వాలుతారు. ఆ భూమి ఎవరిది అయినా ఫర్లేదు పట్టించుకోరు. పేదల భూమి అయినా, రైతుల భూమి అయినా లెక్కజేయరు. పట్టనట్టే ఉంటారు. తాజాగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ, కరడ్ పల్లి గ్రామాలపై పెద్దల కన్నుపడింది. రైతుల వ్యవసాయ భూములపై వారి కన్నుపడింది. జ్యూట్ పరిశ్రమ పేరుతో వారు ఆక్రమించేస్తున్నారు. ఆగ్రహించిన రైతులు ఆ స్థలం లోనే దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు.. ప్రాణాలు పోయినా దీక్ష విరమించేది లేదని స్పష్టంచేశారు. వారికి సీనియర్ నాయకురాలు ఇంద్ర శోభన్ మద్దతు తెలిపారు. దీక్ష వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు. దళితులకు ప్రభుత్వం మూడెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నారని రైతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీరును ఇందిర శోభన్ ఖండించారు.

ఏడు వందల ఎకరాల భూములను ఆక్రమంచారని ఆగ్రహించారు. గ్రామసభ నిర్వహించకుండా.. రైతులకు నోటీసులు పంపించకుండా.. అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవడం సరికాదన్నారు. ఆర్టికల్ 2013 ప్రకారం రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూములు లాక్కోవటం ఏంటీ అని అడిగారు. నిబంధనలకు విరుద్ధంగా భూములను లే అవుట్ చేయడం అక్రమం అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మద్దతు తెలపడానికి వచ్చిన వారిని బెదిరిస్తున్నారని ఇందిర శోభన్ తెలిపారు. అధికార పార్టీ నేతలు.. పోలీసులు అండదండలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ అంశంపై కూడా ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు బలహీన వర్గాలను పట్టించుకోరా అని ఇందిరా శోభన్ వారిని నిలదీశారు. ఇకనైనా వారి భూములను వారికి ఇచ్చేయాలని సూచించారు.
గద్దల్లా పెద్దలు: రైతుల భూములపై కన్ను.. జ్యూట్ పరిశ్రమ పేరుతో ఆక్రమణ..? రైతుల దీక్ష#industry pic.twitter.com/SCnh6mUJcY
— oneindiatelugu (@oneindiatelugu) December 13, 2021