వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోమారు ఆ కేసులో విజయమ్మ , షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 14న హాజరు కావలసిందే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో పాటు కొండా దంపతులకు ఇటీవల నాంపల్లి కోర్టు సమన్లు జారీ చెయ్యటం, ఆ సమన్లు తమకు అందని కారణంగా వారు నాంపల్లి కోర్టుకు విజయమ్మ , షర్మిల హాజరుకాకపోవటం తెలిసిందే . ఇక ఈ క్రమంలో నాంపల్లి కోర్టు మరోమారు వీరికి సమన్లు జారీ చెయ్యనుంది . స్వయంగా కోర్టు అధికారులే విజయమ్మ, షర్మిలకు సమన్లు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే 2012లో నాటి వరంగల్ జిల్లా పరకాలలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభను నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఇటీవల హైదరాబాద్ స్పెషల్ కోర్టు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితోపాటు ఆమె కుమార్తె షర్మిలకు, కొండా మురళి, సురేఖ దంపతులకు సమన్లను జారీ చేసింది. వారు జనవరి 10వ తేదీన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే నిందితులు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నాంపల్లి కోర్టుకు సమన్లు అందని కారణంగా హాజరు కాలేదు .

 Nampally court again issued summons to Vijayamma and Sharmila to appear before court on Feb 14

కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల పీఎస్‌లో నమోదైన కేసుకు సంబంధించి వారు జనవరి 10న కోర్టుకు వెళ్ళారు . ఉప ఎన్నికల్లో అనుమతి లేకుండా సభ నిర్వహించడంపై కోర్టులో కేసు నడుస్తోంది. నాంపల్లి కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. కోర్టు విజయమ్మ, షర్మిలకు సమన్లు అందించనున్న నేపధ్యంలో ఇక విజయమ్మ , షర్మిల ఫిబ్రవరి 14న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

English summary
AP CM YS Jagan Mohan Reddy's mother Vijayamma and sister Sharmila along with Konda couple have been accused of organizing a public meeting in Warangal district in 2012 without permission. However, the accused YS Vijayamma and YS Sharmila are not attended the Nampally Court pervious trail due to they haven't recieved the summons.konda murali and surekha appeared before the court. now court again isuued the summons to vijayamma and sharmila court officials personally giving the summons to them and the next trail is on feb 14th .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X