వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గజల్ శ్రీనివాస్ కేసు: కోర్టులో పోలీసులకు షాక్, 20 వీడియోలతో బిగుస్తున్న ఉచ్చు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరపనుంది.

ఆల‌య‌వాణి రేడియోలో ప‌నిచేస్తోన్న ఓ యువ‌తిని వేధించిన కేసులో గ‌జ‌ల్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం జ్యుడీషియ‌ల్ కస్ట‌డీలో చంచ‌ల్ గూడ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా నిందితుడిని త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

చూపలేని స్థితిలో గజల్ శ్రీనివాస్ వీడియోలు, కొత్త ఆధారాలు: అమ్మాయి వస్తే వీరు బయటకుచూపలేని స్థితిలో గజల్ శ్రీనివాస్ వీడియోలు, కొత్త ఆధారాలు: అమ్మాయి వస్తే వీరు బయటకు

అన్ని వివరాలు సేకరించామని చెప్పారు కాబట్టి

అన్ని వివరాలు సేకరించామని చెప్పారు కాబట్టి

నాలుగు రోజుల పాటు గ‌జ‌ల్ శ్రీనివాస్‌ని విచారిస్తామ‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ద‌ర్యాప్తు పురోగ‌తి కోసం త‌మ‌ క‌స్ట‌డీలోకి తీసుకుంటామ‌న్నారు. అయితే గురువారం ఇరువురి వాద‌న‌లు విన్న న్యాయస్థానం క‌స్ట‌డీ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. ఇప్పటికే అన్ని వీడియోలు, ఆధారాలు ఇచ్చామని చెప్పారని, అలాంటప్పుడు కస్టడీ అవసరం లేదని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది చెప్పారు.

'బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు''బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు'

కఠిన చర్యలు తీసుకోవాలి

కఠిన చర్యలు తీసుకోవాలి


గజల్ శ్రీనివాస్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలోను ఆయనపై మండిపడుతున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవాడలో ఆయనకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన నిర్వహించారు. యువతిని వేధించిన గజల్ శ్రీనివాస్ పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పార్వతిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది

పార్వతిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది

ఇదిలా ఉండగా, గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతి పోలీస్ స్టేషన్‌కు ఇప్పటికీ రాలేదు. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. పార్వతి ఈ కేసులో ఏ2గా ఉన్నారు.

20 వీడియోలు, బిగుస్తున్న ఉచ్చు

20 వీడియోలు, బిగుస్తున్న ఉచ్చు


రేడియో జాకీని వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆధారాలు ఇచ్చారు. దాదాపు ఇరవై వరకు వీడియోలు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆయన చుట్టు ఉచ్చు బిగుస్తోంది.

English summary
Nampally court on Thursday dismissesd petition seeking custody of singer Ghazal Srinivas by Punjagutta police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X