వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: కిరాయి హంతకుడికి షాక్, భర్తను చంపి ట్విస్ట్, జీవిత ఖైదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. అయితే ఈ కేసును విచారించిన కోర్టు నిందితురాలికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీనికి తోడు వెయ్యి రూపాయాల జరిమానాను కూడ విధించింది. ఈ ఘటనలో మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చులు రేపుతాయి. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తించిన మహిళ కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చింది. అయితే ఈ డబ్బులు తీసుకొన్న వారే ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో భర్తను ఆమె హత్య చేసి చివరకు పోలీసులకు లొంగిపోయింది.

హైద్రాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్‌ను అతడి భార్యే హత్య చేసింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఆమె హత్య చేసింది ఈ ఘటనకు సంబంధించి కోర్టు నిందితురాలుకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.

వివాహేతర సంబంధంతో భర్తను హత్య

వివాహేతర సంబంధంతో భర్తను హత్య

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామానికి చెందిన దంపతులు బంజారాహిల్స్‌ రోడు నెంబర్ 10లో ఉండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. రెండవ కొడుకు మహేష్ అమెరికాలో, చిన్న కొడుకు కెనడాలో నివాసం ఉండేవాడు. మృతుడు సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. అయితే అతను స్థానికంగా మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం భార్యకు తెలిసి భార్య, భర్తలు తరచూ గొడవపడేవాడు. ఈ కారణంగా భర్తను భార్యే హత్య చేసింది.

భర్తను హత్య చేసేందుకు సుపారీ

భర్తను హత్య చేసేందుకు సుపారీ

భర్తను హత్య చేసేందుకు భార్య తన బంధువులకే సుపారీ ఇచ్చింది.సివిల్ కాంట్రాక్టర్ భార్య తన దగ్గరి బంధువు ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చింది. సుమారు రూ.16 లక్షలను ఇచ్చేసింది. అయితే అతను ఆమె భర్తను హత్య చేయలేదు. పైగా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఈ విషయాన్ని ఆమె భర్తకు , పిల్లలకు చెబుతానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో ఆమె భర్తను హత్య చేసింది.

భర్తను హత్య చేసిన భార్య

భర్తను హత్య చేసిన భార్య

అయితే ఎప్పటికైనా ఈ విషయం బయటకు తెలుస్తోందని భార్య భావించింది.భర్తకు తెలిస్తే తనకు ప్రమాదమని భావించింది. భర్తకు ఇచ్చిన కాపీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. 2013 మార్చి 29 తెల్లవారుజామున భర్త మత్తులోకి జారుకొన్నాడు. అదే అదనుగా భావించిన ఆమె రోకలిబండతో బాది భర్తను హత్య చేసింది. అంతేకాదు కిరోసిన్ పోసి నిప్పంటించింది. తర్వాత పోలీసులకు లొంగిపోయింది.

జీవిత ఖైదు విధించిన కోర్టు

జీవిత ఖైదు విధించిన కోర్టు

వివాహేతర సంబంధం నెపంతో భర్తను హత్య చేసిన నిందితురాలుకు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు విధించారు.ఈ కేసులో నిందితురాలికి యావజ్జీవ శిక్షతో పాటు వెయ్యి రూపాయాల జరిమానా విధించారు. ఈ కేసులో మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

English summary
Nampally sessions court ordered life sentence to Laxmi on Saturday.Laxmi killed her husband for extra marital affair with another woman on 2013 March 29 at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X