• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'ఆ ఉమ్మడి కుటుంబం మళ్లీ కలిసింది': హరికృష్ణకు అతనే డ్రైవర్‌గా వచ్చి ఉంటే...

By Srinivas
|

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ 'శివరామరాజు' సినిమా ద్వారా యాభై మందితో ఉన్న ఓ ఉమ్మడి కుటుంబం కలిసిపోయిందని ప్రముఖ దర్శకుడు వీ సముద్ర గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ మృతిని పలువురు ప్రముఖులు తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.

  Harikrishna Restricts Driver 15 Days Back Sent By TDP Senior Member Amarnath Babu

  ఆ సినిమాతో చంద్రబాబు ప్రభుత్వంపై హరికృష్ణ ఆగ్రహం, వైయస్ రాజశేఖర రెడ్డి హామీ!

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. హరికృష్ణ శివరామరాజు సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నానని, ఈ సినిమా కథ గురించి చెప్పగానే సంతోషపడ్డారని, 50 మందితో కూడిన ఓ ఉమ్మడి కుటుంబం ఎప్పుడో విడిపోయిందని, ఈ సినిమా ద్వారా వారు మళ్లీ కలిసిపోయారని గుర్తు చేసుకున్నారు.

  హరికృష్ణకు తెలంగాణ మరో గౌరవం, 450 గజాలలో ప్రభుత్వ నిధులతో స్మారకచిహ్నం

  ఆమెనే పెళ్లి చేసుకున్న హరికృష్ణ: వస్తానో రానో.. హోటల్ నుంచి వెళ్తూ వ్యాఖ్యలు

  డ్రైవర్ కావాలంటే

  డ్రైవర్ కావాలంటే

  హరికృష్ణ వద్ద పని చేసేందుకు కొద్ది రోజుల క్రితం ఓ డ్రైవర్ రాగా, అతనికి షరతులు విధించడంతో ఆయన ఉద్యోగం చేయకుండా వెళ్లాడని తెలుస్తోంది. అతనే కనుక డ్రైవర్‌గా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అంటున్నారు. పదిహేను రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ టీడీపీ నేతకు తనకు డ్రైవర్ కావాలని చెప్పగా, ఆయన ఓ యువకుడిని పంపారు. ఆయన బయోడేటా తీసుకున్న హరికృష్ణ మళ్లీ పిలుస్తానని పంపించారట.

  అతను డ్రైవర్‌గా వచ్చి ఉంటే

  అతను డ్రైవర్‌గా వచ్చి ఉంటే

  ఆ తర్వాత అతనిని మరోసారి పిలిపించారు. ప్రతిరోజు తనను ఇంటివద్ద దించాలని, హోటల్లో పడుకోవాలని, హైవేపై వంద కిలో మీటర్లు, నగరంలో 80 కిలో మీటర్ల లోపు వేగంతో వెళ్లాలని చెప్పారట. ఆ షరతులకు ఓకే అంటే డ్యూటీలో చేరాలని చెప్పారట. అవి నచ్చకపోవడంతో అతను మళ్లీ రాలేదని అంటున్నారు. బహుశా అతను వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అని సదరు నేత అంటున్నారు.

  నక్కను పెంచుకున్న హరికృష్ణ ఎందుకంటే

  నక్కను పెంచుకున్న హరికృష్ణ ఎందుకంటే

  హరికృష్ణ జీవితంలోని పలు అంశాలను ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. జంతువులు, పక్షులు అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆయన పెంచుకునేవారు. నిమ్మకూరులో మేలుజాతి ఎడ్లను, తన హోటల్లో, ఇంట్లో రకరకాల పక్షులను పెంచేవారు. ఆయన ఓ నక్కను కూడా పెంచుకున్నారట. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. జ్యోతిష్యాన్ని నమ్మేవారు. నిత్యం నక్కను చూస్తే మేలు జరుగుతుందని ఎవరో చెప్పడంతో దానిని తెచ్చి పెట్టుకున్నారట. ఉదయాన్నే దానిని చూస్తే మంచి జరుగుతుందని నమ్మేవారట.

  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

  కాగా, నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కళ్యాణ్‌రామ్‌ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు మహాప్రస్థానానికి చేరుకుని పాడె మోశారు. అంతకు ముందు మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో సినీ రాజకీయ ప్రముఖులు, టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.

  English summary
  Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, who was Mr Harikrishna's brother-in-law, and retired judge Justice Jasti Chelameswar, his close friend, were the pall bearers in his last journey.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more