హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

72వేల కి.మీ.యాత్ర: చైతన్యరథంలోనే హరికృష్ణ అంతిమయాత్ర, పరిటాల అడగ్గానే ఒప్పుకున్నారని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/నల్గొండ: నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర 1983 నాటి చైతన్య రథంపై సాగనుందని తెలుస్తోంది. చైతన్యరథం అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆ తర్వాత హరికృష్ణ పేరు గుర్తుకు వస్తుంది. చైతన్యరథంపై టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ రాష్ట్రమంతటా 1983లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బెల్ట్ ఉంటే ప్రమాదం తప్పేది, 15మీ.ర్లు ఎగిరింది: ఎస్పీ, జానకిరాం-హరికృష్ణల కారు నెంబర్ ఒకటే బెల్ట్ ఉంటే ప్రమాదం తప్పేది, 15మీ.ర్లు ఎగిరింది: ఎస్పీ, జానకిరాం-హరికృష్ణల కారు నెంబర్ ఒకటే

ఎన్టీఆర్ చైతన్యరథం నడిపింది హరికృష్ణే. ఈ చైతన్య రథం మీదే హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించే అవకాశముంది. ఇందుకు రామకృష్ణ స్టూడియోలో ఉన్న చైతన్య రథాన్ని సిద్ధం చేస్తున్నారు. 72 వేల కిలోమీటర్ల ఎన్టీఆర్ యాత్రకు హరికృష్ణ సారథిగా ఉన్నారు.

Nandamuri Harikrishna dies in accident: final rites may on chaitanya ratham

హరికృష్ణ ఇదే వాహనాన్ని 1999లో తన సొంత పార్టీ అన్న టీడీపీ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.

హరికృష్ణ అడగ్గానే ఒప్పుకున్నారు: పరిటాల సునీత

Recommended Video

నందమూరి హరికృష్ణ మరణంపై తెలంగాణ టిడిపి లీడర్స్ స్పందన....!

నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ మంత్రి పరిటాల సునీత సంతాపం వ్యక్తం చేశారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా పని చేసి హరికృష్ణ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారని చెప్పారు. అలాగే పార్టీ సమావేశాల్లో తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారన్నారు. పరిటాల రవికి, హరికృష్ణ మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. శ్రీరాములయ్య సినిమాలో సత్యం క్యారెక్టర్‌లో మీరే నటించాలని హరికృష్ణను పరిటాల రవి కోరగానే, అడగగానే ఆయన ఒప్పుకొని చేశారని గుర్తు చేసుకున్నారు.

English summary
Harikrishna was represent Hindupur constituency in AP Assembly. He was also a member of the TDP politburo, the highest decision making body. He was driving NTR's Chaitanya Ratham, the political campaign vehicle. He was also a very popular actor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X