హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉంటే మాత్రం వస్తా: హరికృష్ణను గుర్తు తెచ్చుకొని ఆయన కన్నీరుమున్నీరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ హఠాన్మరణం ఎందరినో కలచివేసింది. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంతోకాలం క్రియాశీలకంగా పని చేశారు. అలాంటి వ్యక్తిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. హరికృష్ణ వెన్నంటి నడిచినవారు, స్నేహితులు, అనుచరులు ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Recommended Video

ముందే కీడు శంకించిన హరికృష్ణ ?

ఆమెనే పెళ్లి చేసుకున్న హరికృష్ణ: వస్తానో రానో.. హోటల్ నుంచి వెళ్తూ వ్యాఖ్యలుఆమెనే పెళ్లి చేసుకున్న హరికృష్ణ: వస్తానో రానో.. హోటల్ నుంచి వెళ్తూ వ్యాఖ్యలు

ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ నేత తన కొడుకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు హరికృష్ణ వద్దకు వెళ్లారు. తాను వస్తానో రానోనని, ఉంటే మాత్రం తప్పకుండా వస్తానని చెప్పారని కన్నీరుమున్నీరు అవుతూ చెప్పారు. హరికృష్ణతో తనది దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం అన్నారు.

మీ పుట్టిన రోజునే నా కొడుకు పెళ్లని చెప్పా

మీ పుట్టిన రోజునే నా కొడుకు పెళ్లని చెప్పా

ఆయన ప్రమాదానికి గురైన ముందు రోజే తాను ఆహ్వానం హోటల్‌కు వెళ్లి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించానని, తనను గుర్తు పట్టి తన బాగోగులు అడిగారని హన్మంతరావు గుర్తు చేసుకున్నారు. మీ పుట్టిన రోజు నాడే నా కొడుకు పెళ్లి ఉందని సంతోషంగా చెప్పానని, దానికి ఆయన తాను ఉంటానో లేదోనని, ఉంటే మాత్రం తప్పకుండా వస్తానని గుర్తు చేసుకున్నారు. కాగా హన్మంతరావు 1999లో అన్న టీడీపీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు.

హరికృష్ణకు అభిమాని

హరికృష్ణకు అభిమాని

హన్మంతరావు చిలకలగూడ నివాసి. టీడీపీ పార్టీ స్థాపించక ముందు నుంచే హరికృష్ణకు హన్మంతరావు అభిమాని. హరికృష్ణ ఆయన్ను మీసాల హన్మంతరావుగా పిలిచేవారు. హన్మంతురావు ఇంట్లో ఏ శుభాకార్యం జరిగినా హరికృష్ణను ఆహ్వానించేవారు. ఇప్పుడు సెప్టెంబర్‌ 2న తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వచ్చారు.

అబిడ్స్‌లో వాణిజ్య సముదాయాలు మూత

అబిడ్స్‌లో వాణిజ్య సముదాయాలు మూత

కాగా, హరికృష్ణ మృతి నేపథ్యంలో బుధవారం ఆబిడ్స్‌లోని వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. రామకృష్ణ థియేటర్లో ఆయన ఎక్కువగా సినిమాలు చూసేవారు.

ఆ గదితో ఎంతో అనుబంధం

ఆ గదితో ఎంతో అనుబంధం

ఆహ్వానం హోటల్లోని 1001 రూంలో హరికృష్ణ కీలక నిర్ణయాలు తీసుకునే వారని అంటున్నారు. ఇక్కడ ఉంటే ఆయన దినచర్య కూడా ఈ గది నుంచే ప్రారంభమయ్యేది. ఉదయం ఆరు గంటల వరకు హోటల్లోని ఈ గది వద్దకు చేరుకునేవారు. ముందుగా ఈ గదికి ఎదురుగా ఉండే వినాయకుడి విగ్రహానికి పూజలు చేసి లోనికి వెళ్లేవారు. ఆ తర్వాత పత్రికలు చదివేవారు.

English summary
Nandamuri Harikrishna friends shares interesting facts about Former MP and Telugudesam Party leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X