• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ఎన్నిక‌ల గ‌డ్డ మీద‌ నంద‌మూరి బిడ్డ‌..! నామినేష‌న్ దాఖ‌లు చేసిన సుహాసిని..!!

|

హైదరాబాద్‌ : ఎట్ట‌కేల‌కు నంద‌మూరి కుటుంబ వార‌సురాలు తెలంగాణ ఎన్నికల బ‌రిలో పోటీ చేస్తోంది. అందుకు సంబందించిన లాంఛ‌నాల‌ను నేడు పూర్తి చేసుకున్నారు. చిన్నాన్న, న‌టుడు బాల‌క్రిష్ణ తో క‌లిసి కూక‌ట్ ప‌ల్లి మునిసిప‌ల్ కార్యాల‌యంలో ఆమె నామినేష‌న్ ధాఖ‌లు చేసారు. అంత‌కు ముందు ఎన్టీఆర్ ఘాట్ లో తాత‌య్య నంద‌మూరి తార‌క రామారావు స‌మాధికి నిమాళులు అర్పించారు. అనంత‌రం మ‌హాప్ర‌స్తానంలోని హ‌రిక్రిష్ణ చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

తాత‌, నాన్న‌, మావ‌య్య‌లే స్పూర్తి..! అందుకే రాజ‌కీయాల్లో కి వ‌చ్చానంటున్న సుహాసిని..!

తాత‌, నాన్న‌, మావ‌య్య‌లే స్పూర్తి..! అందుకే రాజ‌కీయాల్లో కి వ‌చ్చానంటున్న సుహాసిని..!

తాత రామారావు, తండ్రి హ‌రిక్రిష్ణ, మామ‌య్య చంద్ర‌బాబు నాయుడు స్సూర్తిగా తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు సుహాసిని చెప్పుకొస్తున్నారు. రాజ‌కీయ సేవ చేయ‌డం త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అందుకే కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గాన్ని ఎంపిక చేసుకున్న‌ట్టు తెలిపారు. అంతే కాకుండా కూక‌ట్ ప‌ల్లి టికెట్ ని ఆశించిన మంద‌డి శ్రీ‌నివాస రావు, పెద్దిరెడ్డ సైతం సుహాసిని గెలుపుకోసం తాము శ‌క్తి వంచ‌న లేకుండా క్రుషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

నంద‌మూరి వార‌సురాలు హాట్ టాపిక్..! కూక‌ట్ ప‌ల్లిలో సులువైన విజ‌యం అంటున్న నేత‌లు..!

నంద‌మూరి వార‌సురాలు హాట్ టాపిక్..! కూక‌ట్ ప‌ల్లిలో సులువైన విజ‌యం అంటున్న నేత‌లు..!

ఎన్టీఆర్‌ మనవరాలు నందమూరి సుహాసినీ ఇపుడు హాట్‌టాపిక్‌ మారింది. ఎన్నికల్లో టీడీపీ ఆమెను అనుహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఆమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. నందమూరి హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకుంది. ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. రసవత్తరంగా సాగుతున్న తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఆకస్మత్తుగా ఆమె పేరు తెరపైకి తీసుకువచ్చింది. కూకట్‌పల్లి స్థానం నుంచి ఆమె బరిలో దింపుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 గూగుల్ సెర్చింగ్ లో సుహాసిని టాప్..! రెండు రోజుల్లో గ్రాఫ్ పెంచుకున్న సుహాసిని..!!

గూగుల్ సెర్చింగ్ లో సుహాసిని టాప్..! రెండు రోజుల్లో గ్రాఫ్ పెంచుకున్న సుహాసిని..!!

దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగింది. సుహాసినీ ఎవరా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఈమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఎన్టీఆర్‌ మనవరాలు, హరికృష్ణ కూతురు కావడంతో ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో ఎక్కువ సెర్చ్‌ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమె గురించి తెలుసుకునేందుకు గంటకు సగటు 80 మంది సెర్చ్‌ చేస్తుండడం గమనార్హం. అధికార టీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రధాన ఆకర్షణగా ఉండగా ఇపుడు మహాకూటమికే ఎన్టీఆర్‌ మనవరాలు సుహాసినీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

టీడీపీకి మళ్లీ గ్లామర్‌..! తెలంగాణ లో మార్క్ చూపిస్తామంటున్న వార‌సురాలు..!!

టీడీపీకి మళ్లీ గ్లామర్‌..! తెలంగాణ లో మార్క్ చూపిస్తామంటున్న వార‌సురాలు..!!

కూకట్‌పల్లి అభ్యర్ధిగా ఎన్టీఆర్‌ మనవరాలు సుహాసినీ పేరు టీడీపీ ఖరారు చేయడంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం మారిపోయింది. తెలంగాణ టీడీపీలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఆమె పోటీ కారణంగా సెటిలర్స్‌ ఓటుతో పాటు స్థానికుల ఓట్లు టీడీపీకి గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మసకబారిన టీడీపీకి ఇపుడు ఆమె కాంతిపుంజంలా కనిపిస్తోంది. సౌమ్యంగా, సింపుల్‌గా ఉన్న సుహాసినీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెకు ఎన్టీఆర్‌ కుటుంబంమంతా బాసటగా ఉండడం గమనార్హం. ఆమె నామినేషన్‌కు ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ తోడుగా వచ్చారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌కలిసి ఆమెకు మద్దతుగా ప్రకటన చేశారు.

English summary
Nandamuri's family heir is finally contesting for Telangana election. Today, the formalities have been completed. Balakrishna along with her nomination at Kukat Palli municipal office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X