హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూకట్‌పల్లికి నేను వెళ్లడం లేదు: నారా భువనేశ్వరి, నందమూరి సుహాసినికి మరో ప్లస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని తరఫున తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని, కానీ ఆమెకు తాను గెలవాలని ఆకాంక్షిస్తున్నానని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

<strong>తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?</strong>తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?

 సుహాసినికి భువనేశ్వరి ఆల్ ది బెస్ట్

సుహాసినికి భువనేశ్వరి ఆల్ ది బెస్ట్

ఓ మహిళగా ఆమె గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆమె కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ అన్నారు కొన్ని కారణాల వల్ల తాను ప్రచారానికి వెళ్లడం లేదని చెప్పారు. సుహాసినికి అండగా అసంఖ్యాక టీడీపీ కార్యకర్తలు అండగా ఉన్నారని, తమ కుటుంబం అండగా ఉందని చెప్పారు. కాగా, సుహాసిని గెలుపు కోసం పలువురు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు సహా ఏపీ మంత్రి పరిటాల సునీత, నటుడు తారకరత్న ప్రచారం చేశారు. పలువురు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తారని భావిస్తున్నారు.

అప్పుడే కూటమి గెలుపు ఖాయమైంది

అప్పుడే కూటమి గెలుపు ఖాయమైంది

అసెంబ్లీ రద్దు చేసిన రోజే తెరాస పతనం ఖాయమైందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాక చేయాల్సిన అభివృద్ధిని కేసీఆర్ గాలికి వదిలేశారని మంగళవారం సర్వే సత్యనారాయణ కూకట్‌పల్లిలో ఆరోపించారు. టీడీపీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి వారి స్వార్థప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరారని మండిపడ్డారు. పేదలను ఆదుకునేందుకు టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు.

ఎన్టీఆర్ బాటలు సుహాసిని

ఎన్టీఆర్ బాటలు సుహాసిని

ఎన్టీఆర్ బాటలోనే సుహాసిని నడుస్తారని సర్వే అన్నారు. ఆమెను గెలిపించేలా పని చేయడమే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అన్నారు. కేసీఆర్‌ కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని విడిపించాలంటే ప్రజాకూటమిని గెలిపించాలని కుత్బుల్లాపూర్‌ ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.

తారకరత్న ప్రచారం

తారకరత్న ప్రచారం

తెలుగు సినీ నటుడు తారకరత్న కూడా ప్రచారం చేస్తున్నారు. తన సోదరి సుహాసినిని భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు పలుకుతుండటం ఆనందంగా ఉందన్నారు. తాను కూడా కొన్ని రోజులు ప్రచారం చేస్తానని చెప్పారు.

సుహాసినికి మరో ప్లస్

సుహాసినికి మరో ప్లస్

ఇదిలా ఉండగా, తెరాసకు రాజీనామా చేసిన కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు మంగళవారం టీడీపీలో చేరారు. విజయవాడలో చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. కేసీఆర్‌ను తన తండ్రిలా, తెరాసను సొంత ఇంటిలా భావించానని, తనతో పాటు ఎంతోమందికి పార్టీలో అన్యాయం జరిగినా మార్పు కోసం ఓపికగా ఎదురుచూశామన్నారు. తెలంగాణవాదాన్ని కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారన్నారు. పార్టీ పక్కదారి పట్టిందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కూడా కనిపించడం లేదన్నారు. పార్టీలోకి గొట్టిపాటి రావడం టీడీపీకి మరింత ఊరట. దీంతో సుహాసిని మెజార్టీ మరింత పెరుగుతుందని అంటున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu's wife Nara Bhuavaneshwari talks about Nandamuri Suhashini winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X