హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ, చంద్రబాబు నాయుడు ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టంచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఎన్నికల సంఘం హెచ్చరికలతో అన్ని పార్టీలు ప్రచారానికి ముగింపు పలికాయి.

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బైక్‌ ర్యాలీలో నారా లోకేశ్‌ బుల్లెట్‌ నడిపారు. హైటెక్‌ సిటీ నుంచి ఎన్టీఆర్‌ఘాట్‌ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం, ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు గ్రేటర్‌ ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే ఏపీ సీఎం చంద్రబాబుపై చిత్రమైన విమర్శలు చేస్తున్నారన్నారు.

 ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఏపీని చంద్రబాబుకు, తెలంగాణను తనకు ప్రజలు ఇచ్చారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘ప్రాంతాలేమయినా మీ సొత్తా? మా సొత్తా? అది ప్రజలు ఇచ్చిన తీర్పు'' అన్నారు. భువనేశ్వరి వదిన కూడా టీఆర్‌ఎస్‌కే ఓటువేస్తానన్నారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై కూడా లోకేశ్ స్పందించారు.

 ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి గురించి ఇలాంటి అబద్ధం చెప్పడం దారుణం., దౌర్భాగ్యమని, ఒక బహిరంగ సభలో ఓ సీఎం ఇంత పెద్ద అబద్ధం చెప్పడం చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సొంతంగా మెజారిటీ సాధిస్తే ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావిస్తామన్నారు.

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఎంఐఎంతో కలుపుకొని, ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిసి మేయర్‌ పీఠం దక్కించుకుంటే అది రెఫరెండం కాబోదన్నారు. వరంగల్‌ ఎన్నికల ఫలితంపై స్పందించిన లోకేశ్, అక్కడి ప్రజలు వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించారన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిదే మేయర్‌ పీఠమన్నారు.
ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన వారికి ఓటేయాలని పిలుపునిచ్చారు. టీడీపీతోనే హైదరాబాద్‌కు భద్రత అని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. దోపిడీదారు, పెత్తందారుకు సీఎం కేసీఆర్‌ ప్రతిరూ పమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు.

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఎన్నికలకు ముందు పారిశుధ్య కార్మికులు దేవుళ్లంటూ కొనియాడిన కేసీఆర్‌.. వారు సమ్మె చేస్తే దయ్యాలంటూ అభివర్ణించారని చెప్పారు. ఓటరు దేవుళ్ల వద్దకు వెళ్లే ధైర్యం లేక ఒక్క రోజు కూడా ప్రచారం చేయని సీఎం కేసీఆర్‌.. అడ్డామీది కూలీలతో బహిరంగ సభ నిర్వహించారని రమణ వ్యాఖ్యానించారు.
 ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

హైదరాబాద్‌లో 170 పనులు చేసినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారని, అందులో ఏ ఒక్కటి చేసినట్టు నిరూపించినా.. 150 స్థానాల్లో పోటీ నుంచి తప్పుకొంటామని ఎర్రబెల్లి దయాకర్‌రా వు సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ మాటలు నీటి మూటలని, ఆయనో అబద్ధాల కోరు అని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

తన కొడుకు కేటీఆర్‌ను ప్రమోట్‌ చేయడానికే కేసీఆర్‌ బహిరంగ సభ పెట్టారని టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ రోడ్లు ఊడ్చేందుకు కవితకు సరిపోలేదనా? హైదరాబాద్‌లో ఊడ్చేందుకు వచ్చారంటూ ప్రశ్నించారు.

 ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆ అబద్ధం చెప్పిన తొలి సీఎం కేసీఆరే: నారా లోకేశ్

ఆంధ్రావారిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారని, ఆ కపట ప్రేమని సీమాంధ్రులు నమ్మవద్దని ఏపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సీమాంధ్రులు టీడీపీకి ఓటు వేస్తేనే ఎన్టీ రామారావు ఆత్మకు శాంతి కలుగుతుంద న్నారు.

English summary
Nara lokesh fires on Chief minister kcr on bhuvaneswari vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X