• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!

|

అమరావతి/హైదరాబాద్ : రికార్డులు తిరగ రాయడం, చరిత్ర సృష్టించడం క్రీడల్లోనే కాదు..రాజ్యంగ బద్ద పదవుల్లో ఉండి కూడా నెలకొల్పవచ్చు అని మన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిరూపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదేళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. అంతకు ముందు ఆయన 2007 నుంచి ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. అత్యధిక కాలం (12 సంవత్సరాలు) పనిచేసిన గవర్నర్ గా నరసింహన్ చరిత్ర సృష్టించారు.

ఆ ముసలిదంపతుకు డబుల్ బెడ్ రూం ఇస్తానన్న కేటీఆర్..! ఆ ముసలిదంపతుకు డబుల్ బెడ్ రూం ఇస్తానన్న కేటీఆర్..!

2009 డిసెంబర్ నెలలో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా ఆయనను నాటి యూపీయే సర్కార్ నియమించింది. అప్పట్లో తెలంగాణా ఉద్యమం చాలా దూకుడుగా సాగుతోంది. గవర్నర్ గా నరసింహన్ చాలా చాకచక్యంగా వ్యవహకరించినట్టు అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న గవర్నర్..! తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డ్..!!

పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న గవర్నర్..! తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డ్..!!

ఇక్కడకు రాక ముందు ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. మరో వైపు కొణిజేటి రోశయ్య అపుడే సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొత్తం పరిస్థితి ఆయనకు ఎక్కడా అంతు చిక్కడంలేదు. ఆయన ఢిల్లీ ఆదేశాలను అమలు చేసే ఓ మర యంత్రంగా నాడు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. అట్టుడుకుతున్న ఉమ్మడి ఏపీని చాలా వరకూ చక్కబెట్టడంతో గవర్నర్ నరసింహన్ నాడు నిర్వహించిన పాత్ర గుర్తించతగినదే. ఇక గవర్నర్ నరసింహన్ పదేళ్ళ పాటు సుదీర్ఘంగా రాజ్ భవన్ లో కొనసాగడం అంటే రికార్డుగా చెప్పుకోవాల్సిందే.

కేంద్ర ప్రభుత్వాలు మారాయి..! కాని గవర్నర్ పదవిని కాపాడుకున్న నరసింహన్..!!

కేంద్ర ప్రభుత్వాలు మారాయి..! కాని గవర్నర్ పదవిని కాపాడుకున్న నరసింహన్..!!

యూపీయే సర్కార్ 2014లో దిగిపోయినా కూడా ఆయన బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ, నాటి హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ కి కూడా సన్నిహితంగా మెలిగారు. అదే విధంగా ప్రస్తుత హోం మంత్రి అమిత్ షాకు కూడా ఆయన సన్నిహితంగా మెలుగుతున్నారు. భిన్న ధృవాలైన రెండు పెద్ద జాతీయ పార్టీలకు ఒకే సమయంలో ఇష్టమైన వ్యక్తిగా ఉండడం అంటే ఆషామాషీ కాదు.. ఓ విధంగా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి రాజనీతికి తీసిపోని విధంగా గవర్నర్ గా నరసింహన్ దూకుడు ప్రదర్శించారని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల తో విడదీయరాని బంధం..! విభజన సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన గవర్నర్..!!

తెలుగు రాష్ట్రాల తో విడదీయరాని బంధం..! విభజన సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన గవర్నర్..!!

ఇక గవర్నర్ గా పుష్కర కాలం పాటు ఆయన పనిచేసినట్లు అయింది. అంతకు ముందు ఆయన 2007 నుంచి చత్తీస్ గడ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. దేశంలో రాజకీయాలతో సంబంధం లేని ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంత ఎక్కువ కాలం రాజ్ భవన్ లో ఉన్నారంటే ఆయన పనితీరునే చూడాలి. ఇదిలా ఉంటే నరసింహన్ అయిదుగురు సీఎంలతో కలసి పనిచేశారు. నలుగురి చేత సీఎం లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ జగన్ ల చేత ప్రమాణం చేయించారు.

సుధీర్గకాలం పనిచేసిన ఏకైక గవర్నర్..! ఎక్కువమంది సీఎంలతో ప్రమాణం చేయించింది కూడా ఆయనే..!!

సుధీర్గకాలం పనిచేసిన ఏకైక గవర్నర్..! ఎక్కువమంది సీఎంలతో ప్రమాణం చేయించింది కూడా ఆయనే..!!

ఇక దేశంలో మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ వంటి ఇద్దరు ప్రధానులు, ఇద్దరు రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాధ్ కోవింద్ ల వద్ద పనిచేశారు. కాగా, జూలై 10తో ఆయన పదవీ కాలం ముగిసింది. ఇప్పటికి అనేకసార్లు ఆయన పదవిని పొడిగించిన కేంద్రం ఇక నరసింహన్ ను కొనసాగించదని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. 74 సంవత్సరాల వయస్సు ఉన్న నరసింహన్ సీనియర్ సిటిజన్ అయినప్పటికీ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుండడం విశేషం.

English summary
Narasimhan, Governor of our Joint States, proved that the rewriting of records and history is not in sports. Joint Governor of Telangana and Andhra Pradesh ESL Narasimhan has completed a ten-year tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X