వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రలోనే నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టా రెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారని చెబుతున్నారు.

హైదరాబాదులోని ఎస్సార్ నగర్‌లో గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Narayankhed MLA kishta Reddy dies

2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1989, 1999, 2009, 2014లలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మెదక్ జిల్లా గొప్ప నేతను కోల్పోయిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కిష్టా రెడ్డి మృతి తెలిసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

కిష్టా రెడ్డి వయస్సు 57. ఆయన దివంగత నేత బాగారెడ్డి ద్వారా రాజకీయాల్లో పట్టు సాధఇంచారు. 1977లో పంచగామ సర్పంచిగా పని చేశారు. 1982లో నారాయణఖేడ్ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

English summary
Congress Party senior leader and Narayankhed MLA kishta Reddy dies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X