మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణఖేడ్ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎం. భూపాల్‌రెడ్డి: ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

|
Google Oneindia TeluguNews

మెదక్: జిల్లాలోని నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎం భూపాల్‌రెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి గడిచిన ఏడాది ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచిన భూపాల్‌రెడ్డి పేరునే టిఆర్‌ఎస్ తిరిగి తమ అభ్యర్థిగా ప్రకటించింది.

NarayanKhed TRS candidate M Bhupal reddy

కాగా, కాంగ్రెస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే కృష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డిని అదేవిధంగా బీజేపీ-టీడీపీలు ఉమ్మడి అభ్యర్తిగా ఎం. విజయ్‌పాల్‌రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.

నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనవరి 27న నామినేషన్ల స్వీకరణకు గడువు. 28న నామినేషన్ల పరిశీలన. 30వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు. ఫిబ్రవరి 13న పోలింగ్ నిర్వహణ. 16వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

గ్రేటర్ మేయర్ పదవి బిసిలకు...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించినట్లు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. అలాగే, నోటా పైన మరింత స్పష్టత కావాలని ఈసీ అడిగింది. రేపు లేదా ఎల్లుండి దీని పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వవచ్చు. మరోవైపు, గ్రేటర్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు రేపటితో ముగుస్తున్నా బిజెపి ఇంకా పూర్తి అభ్యర్థులను ప్రకటించలేదు.

English summary
TRS announced its party NarayanKhed candidate is M Bhupal reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X