వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతి కోసం వెళ్ళి శవమై, పోలీసుల తీరుపై అనుమానాలు, నరేష్ కుటుంబసభ్యుల ఆందోళన

సంచలనానికి కారణమైన నరేష్, స్వాతి కేసులో భువనగరిరి పోలీసుల నిర్లక్ష్యంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనానికి కారణమైన నరేష్, స్వాతి కేసులో భువనగరిరి పోలీసుల నిర్లక్ష్యంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.

ముంబైలో ఉన్న నరేష్, స్వాతిని పోలీసులు ఎందుకు పిలిపించారనే ప్రశ్న కూడ ఉత్పన్నమౌతోంది. అయితే నరేష్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు విషయమై పోలీసులు కదిలారు. జూన్ 1వ, తేది నాటికి నరేష్ ఆచూకీ చెప్పాలని పోలీసులను కోర్టు ఆదేశించడంతో పోలీసులు అనివార్యంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నరేష్, స్వాతి కేసు విషయంలో కూడ పోలీసులు అనుసరించిన విషయమై తొలినుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు నరేష్ ను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరో వైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన భువనగిరి పోలీసులకు ఈ కేసు చుట్టుకొనే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే నరేష్ అదృశ్యంపై మొదటినుండి స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిపైనే అనుమానాలున్నాయి.అయితే ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

భువనగరిలో నరేష్ కుటుంబసభ్యుల ఆందోళన

భువనగరిలో నరేష్ కుటుంబసభ్యుల ఆందోళన

నరేష్ కుటుంబసభ్యులు భువనగరిలోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. నరేష్ ను హత్య చేసిన కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.నరేష్ , స్వాతిని ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు.అయితే దీన్ని తట్టుకోలేక స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పథకం ప్రకారం నరేష్ ను ట్రాక్టర్ రాడ్ తో హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును కూడ నరేష్ కుటుంబసభ్యులు తప్పుబడుతున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలి

శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలి

తమ ఒక్కగానొక్క కొడుకు నరేష్ ను హత్యచేసిన శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని నరేష్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకోవడం తప్పా అంటూ నరేష్ తల్లిదండ్రులు ప్రశ్నించారు.నరేష్ హత్య చేయడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు.నరేష్ ను చంపిన విషయం స్వాతికి కూడ తెలుసునని వారు ఆరోపించారు. ఈ కారణంతోనే స్వాతిని కూడ చంపి ఆత్మహత్యచేసుకొన్నట్టుగా వరకట్న వేధింపులంటూ లేనిపోని కట్టుకథలు అల్లారని వారు ఆరోపించారు.శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించకపోతే తమ కుటుంబమంతా ఆత్మహత్యచేసుకొంటామని హెచ్చరించారు.

హైకోర్టు జోక్యంతోనే కదలిన డొంక

హైకోర్టు జోక్యంతోనే కదలిన డొంక

ఈ నెల 2వ, తేదిన భువనగిరికి స్వాతితో కలిసి వచ్చిన నరేష్ ఆచూకీ దొరకలేదు.దీంతో నరేష్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జోక్యంతో పోలీసులు నరేష్ ఆచూకీ కోసం కదిలారు.తొలి నుండి ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.అయితే వివాహం చేసుకొని ముంబాయిలో ఉన్న నరేష్, స్వాతిలను పోలీసులు మార్చి మాసం చివర్లో ఎందుకు రామన్నపేటకు పిలిపించారని కుటుంబసబ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే రామన్నపేటకు వచ్చిన స్వాతి తండ్రితో వెళ్ళిపోగా నరేష్ మాత్రం ముంబైకి వెళ్ళారు. అయితే వారంరోజులకే స్వాతి తిరిగి ముంబాయికి వెళ్ళిపోయింది.

స్వాతి కోసం వెళ్ళి చనిపోయాడు

స్వాతి కోసం వెళ్ళి చనిపోయాడు


ఈ నెల 2వ, తేదిన భువనగిరి బస్టాండ్ లో స్వాతిని నరేష్ ఆమె తండ్రికి అప్పగించాడు. సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు కారులో స్వాతిని తమ గ్రామానికి తీసుకెళ్ళారు.అయితే స్వాతిని తీసుకెళ్ళిన కారును నరేష్ వెంబడంచాడు. స్వాతి కోసం ఇంటి బయట ఎదురుచూస్తుండగా అనుమానం వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కి అనుకోకుండా నరేష్ కలిశాడు. దీంతో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి నరేష్ ను హత్య చేశాడు.

English summary
Naresh family members protest at Jagjeevanram statue in Bhuvanagiri on Sudnay. They demanded to government to punish Srinivasa Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X