వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు జోరును త‌గ్గించేందుకు జాతీయ పార్టీల క‌స‌ర‌త్తు..! కాంగ్రెస్, బీజేపి ల వ్యూహం ఏంటి..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా కారు దూసుకుపోయిన విష‌యం తెలిసిందే..! ప్ర‌తిప‌క్ష పార్టీల అడ్రెస్సును దాదాపు గ‌ల్లంతు చేసారు చంద్ర‌శేఖ‌ర్ రావు. కనీసం పార్లమెంటు ఎన్నికలలోనైనా పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో జాతీయ పార్టీలు వ్యూహాలు రిచిస్తున్నాయి. కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పై ఎత్తులు వేయడంలో పోటీపడుతున్నాయి. మూడు నుంచి నాలుగు స్థానాలు గెలుపొంది తమ సత్తా నిరూపించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి కాంగ్రెస్, బీజేపి లు.

అక్ర‌మ‌ అరెస్ట్‌లు జ‌రుగుతాయి: ఎన్నిక‌లు మీరే చేయాలి: ప‌వ‌న్ కు బాబు డ‌బ్బులు : జ‌గ‌న్ ..! అక్ర‌మ‌ అరెస్ట్‌లు జ‌రుగుతాయి: ఎన్నిక‌లు మీరే చేయాలి: ప‌వ‌న్ కు బాబు డ‌బ్బులు : జ‌గ‌న్ ..!

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు..! కారు జోరుకు బ్రేకులు వేస్తారా..?

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు..! కారు జోరుకు బ్రేకులు వేస్తారా..?

లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీని ఎదుర్కొనేంద‌కు రెండు జాతీయ పార్టీలు శ్ర‌మిస్తున్నాయి. అలాగే ప్ర‌స్తుత లోక్ స‌భ ఎన్నిక‌లు రెండు జాతీయ పార్టీల‌కు కీలకంగా మారాయి. ఇంకా చెప్పాలంటే ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇది జీవన్మరణ సమస్యగా ప‌రిణ‌మించింది. నిన్నటి దాకా అధికారాన్ని, పదవులను అనుభవించి అన్ని విధాలా లాభపడిన సీనియర్ నాయకులు జారుకుంటున్నా కాపాడుకోలేని దీన స్థితి కాంగ్రెస్ లో క‌నిపిస్తోంది. కనీసం మిగిలి ఉన్నవారిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కారు... పదహారు అనే నినాదంతో గులాబీ పార్టీ ముందుకు వెళ్తోంది. 17వ స్థానాన్ని ఎంఐఎం పార్టీకి వదిలేసింది కూడా. పదహారుకు పదహారు స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు కసరత్తు చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు.

కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న బీజేపి, కాంగ్రెస్..! ప్ర‌భావం చూపిస్తుస్తాయా..?

కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న బీజేపి, కాంగ్రెస్..! ప్ర‌భావం చూపిస్తుస్తాయా..?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన చంద్ర‌శేఖ‌ర్ రావు, ఈసారి ఆచితూచి అభ్యర్థులను ప్రకటించారు. దీని వెనకాల పెద్ద లక్ష్యమే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటును కూడా చేజార్చుకోవద్దు అనే లక్ష్యంతో అభ్యర్థులను వడబోసి ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీలను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలోని బలమైన నేతలకు గాలం వేస్తూ ప్రధాన ప్రతిపక్షాన్ని ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్టు తెలుస్తోంది.

కారుజోరును నిలువ‌రించాల‌నుకుంటున్న బీజేపి, కాంగ్రెస్..! ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌..!

కారుజోరును నిలువ‌రించాల‌నుకుంటున్న బీజేపి, కాంగ్రెస్..! ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌..!

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను బలంగా ప్రయోగిస్తూ ప‌స్తున్న వారిని వ‌స్తున్న‌ట్టు కారెక్కిస్తున్నారు గులాబీ నేత‌లు. ఇందులో స్వచ్ఛందంగా వచ్చే వారు కొందరైతే రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత పనులు ఆశించి వస్తున్న వారు మరికొందరు ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతాం, ప్రధాన ప్రతిపక్షం అవుతామని నిన్నటి వరకు బీరాలు పలికిన బీజేపీ చతికిల పడింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పుణ్యామా అని 5 సీట్లను గెలుపొందిన బీజేపీ ఈసారి స్వతంత్రంగా పోటీ చేసి ఒక్కసీటుతో సరిపుచ్చుకున్నది.

రెండు జాతీయ పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం కానున్న ఎంపి ఎన్నిక‌లు..! ప్ర‌భావితం చేస్తాయా..?

రెండు జాతీయ పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం కానున్న ఎంపి ఎన్నిక‌లు..! ప్ర‌భావితం చేస్తాయా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జీ.కిషన్ రెడ్డి ఓడిపోవ‌డం తెలంగాణ బీజేపికి కోలుకోని ద‌బ్బ గా ప‌రిణ‌మించింది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కనీసం మూడు సీట్లలో జెండా ఎగురవేయాలని పావులుక‌దుపుతోంది బీజేపి. సికింద్రాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ నియోజకవర్గాలపై అధికంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ కూడా కనీసం నాలుగైదు స్థానాలపై గురి పెట్టింది. ఇప్పటికే అభ్యర్థులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పార్టీ పెద్దలు, ప్రచారానికి పదును పెడుతున్నారు. భువనగిరి, మల్కాజిగిరి నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రచారం దూసుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోటుపాట్లను పరిగణనికలోకి తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో జెట్ స్పీడు వేగంతో దూసుకెళ్తున్న కారుకు ఎలాగైనా బ్రేకులు వేయాల‌ని అటు బీజేపి, ఇటు కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి.

English summary
In the Assembly elections, the car was went up out of the expectations. Chandrashekhar Rao has almost damaged the address of the Opposition parties. National parties have been strategizing the goal of defending the least of the parliamentary elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X