వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్ల ముప్పు.: కేసీఆర్‌కు రూ. 7 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ బస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మావోయిస్టులు టార్గెట్ చేస్తారనే అనుమానంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు హోం శాఖ భద్రతను పెంచింది. ఆయన కోసం ప్రత్యేకంగా కొత్త బుల్లెట్ ప్రూఫ్ బస్సును ఏర్పాటు చేయనుంది.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో కేసిఆర్‌కు వారి నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ప్రత్యేక ఫీచర్స్‌తో బస్సు

ప్రత్యేక ఫీచర్స్‌తో బస్సు

కేసీఆర్‌ కోసం కొత్త బస్సును రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ తీసుకుంటుంది. అందులో అత్యధునాతన సౌకర్యాలతో పాటు భద్రతకు సంబంధించిన కొత్త ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. దాని విలువ 7 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దాన్ని కేసిఆర్ రాష్ట్ర పర్యటనలో వాడుతారు.

Recommended Video

Encounter : Ten Maoists And A Constable Lost Life
ఇది వరకు ఓ బస్సు ఉంది

ఇది వరకు ఓ బస్సు ఉంది

ముఖ్మమంత్రికి ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడీస్ బెండ్ ఉంది. దాన్ని రూ.4 కోట్లకు మూడేళ్ల క్రితం తీసుకున్నారు. తాజాగా తీసుకునే బస్సు దానికి అదనమవుతుంది. పైగా, మరిన్ని భద్రతా ఏర్పాట్లు దీంట్లో ఉంటాయి. కొత్త బస్సును కేసిఆర్ నిత్యం వాడుతారు. పాత బస్సును ప్రత్యామ్నాయం కోసం ఉంచుతారు.

పరిశీలనకు కమిటీ ఏర్పాటు

పరిశీలనకు కమిటీ ఏర్పాటు

కొత్త బుల్లెట్ ప్రూఫ్ బస్సును తీసుకోవడానికి టెండర్లను ఆహ్వానించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు ఆర్ అండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

మరో రెండు, మూడు నెలలు పడుతుంది..

మరో రెండు, మూడు నెలలు పడుతుంది..

కొత్త బుల్లెట్, మైన్ ప్రూఫ్ బస్సులో ఉండాల్సిన ఫీచర్స్‌ను ఆ కమిటీ పరిశీలిస్తుంది. తుది నిర్ణయం కోసం ప్రతిపాదనలను జిఎడికి పంపిస్తారు. టెండర్లకు తుది రూపం ఇవ్వడానికి రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు.

ప్రధానంగా హెలికాప్టరే వాడుతారు

ప్రధానంగా హెలికాప్టరే వాడుతారు

జిల్లాలో పర్యటనలకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఎక్కువగా హెలికాప్టర్‌నే వాడుతారు. ఎన్నికల ప్రచారంలో కూడా హెలికాప్టర్‌నే ఆయన ప్రధానంగా వాడుతారు. అయితే, జిల్లాల్లో ఉండాల్సి వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సును వాడుతారు.

English summary
Telangana home department has decided to beef up security for chief minister KCR by procuring a new bulletproof bus after Maoists threatened to target
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X