వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం గ్యాంగ్ అరెస్ట్ ..పోలీసుల అదుపులో నయీం భార్యతో పాటు అనుచరులు .. ఎందుకంటే ?

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నయీం బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అనుచరులను, నయీం భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నయీం భార్య హసీనా బేగం, గతంలో నయీం అనుచరుడుగా ఉన్న పాశం శ్రీనివాస్, మున్సిఫల్ కౌన్సిలర్ అబ్దుల్ నజీర్‌తో పాటు నయీం సమీప బంధువు ఫహీమ్‌ను కూడ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి రూ.88.37 లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు.

<strong>'భువనగిరి భాయ్' అంటే భయం లేదా? ఖతం చేస్తాం: తెరపైకి నయీం గ్యాంగ్</strong>'భువనగిరి భాయ్' అంటే భయం లేదా? ఖతం చేస్తాం: తెరపైకి నయీం గ్యాంగ్

Nayeem gang arrest .. Nayeems wife and followers in police custody... why because ..?

నయీం బినామీ ఆస్తుల విక్రయానికి ప్రయత్నం .. అరెస్ట్ చేసిన పోలీసులు
నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉన్న ఈ గ్యాంగ్ ఇప్పుడిప్పుడే నయన్ బినామీ ఆస్తులపై కన్నేసి వాటిని తమ పేరు మీదకి మార్చుకుని తిరిగి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరి సమీపంలోని నయీం కు చెందిన భూమి తుమ్మ శ్రీనివాస్ పేరున రిజిస్ట్రేషన్ అయింది. తాజాగా ఈ భూమిని విక్రయించాలని ఈ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.ఈ భూమిని కొనుగోలు చేసేందుకు వెంకటేశ్వరరావు ముందుకు వచ్చాడు. ఈ భూమిని రూ.89 లక్షలకు ఐదు ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ నెల 8వ తేదీన భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసినట్టు రాచకొండ సీపీ తెలిపారు. అయితే ఇంతా జరుగుతున్నా పట్టించుకోని పోలీసులపై, జిరాక్స్ డాక్యుమెంట్ లతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ఎంక్వయిరీ జరుగుతుంది.

ఇద్దరు పోలీసులపై వేటు
పలు కమర్షియల్ కాంప్లెక్స్, ఖాళీగా ఉండే స్థలాలను కబ్జా చేసి వారిపేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటు అక్రమాలకు వారు కొనగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్నామని రాచకొండ కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు.నయీంకు చెందిన ఆస్తులు ఇంకా ఎక్కడెక్క ఉన్నాయో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. కాగా..ఇప్పటికే భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐ వెంకన్నను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అటాచ్ చేశారు. నయీం ముఠాకు సహకరించారనే పలువురు పోలీసు అధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో తాజాగా నయీం బినామీ ఆస్తులు తెరమీదకు రావటం సంచలనంగా మారింది .

English summary
Gangster Nayeem's wife and his followers were arrested by police. Nayeem benami assets were registered in their name and police seized them in order to re-sell them. Police in the Inquiry on where Nayeem Benami assets are located. CP suspended two police officers involved in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X